మాజీమంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్లో జరిగిన జాయినింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మార్పు అని చెప్పి ఊదరగొట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయిందన్నారు. ఈ రెండేళ్లలో కూల్చివేతలు, ఎగవేతలు, పేల్చివేతలు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని విమర్శించారు. అప్పుడు కాలేశ్వరం బ్యారేజ్ ని పేల్చారు.. ఇప్పుడు చెక్ డ్యాం లను పేలుస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెసోళ్లు దొంగతనంగా ఇసుక తరలించేందుకు కష్టమవుతుంది అని చెక్ డ్యాం లు పేలుస్తున్నారు. నిన్న మొన్న పెద్ద…