NTV Telugu Site icon

KTR : రైతుల తరపున అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం

Brs Ktr

Brs Ktr

KTR : తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చే ప్రభుత్వం నిర్ణయాన్ని బీఆర్‌ఎస్‌ వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర, అస్థిత్వంపై అవగాహన లేకుండా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ప్రభుత్వంపై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. ఈ చర్య తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరుస్తుందని, ప్రజల ఆవేదనకు బీఆర్‌ఎస్‌ గొంతుకగా నిలుస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గాలను శాసనసభ, మండలిలో నిలదీస్తామని కేటీఆర్‌ ప్రకటించారు. గ్రామ పంచాయతీలలో నిధుల కొరతను ప్రశ్నిస్తూ, సర్పంచులు, మాజీ సర్పంచులకు బిల్లుల చెల్లింపులు జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లె ప్రగతి ద్వారా దేశంలో అత్యుత్తమ గ్రామాలుగా తెలంగాణ గ్రామాలు నిలిచినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు పల్లెల అభివృద్ధిని దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు.

Sonia Gandhi: జార్జ్ సోరోస్ ఫండింగ్ చేసిన సంస్థతో సోనియాగాంధీకి సంబంధం..

దళితబంధు కార్యక్రమం అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అందుకు చెల్లింపులు జరగలేదని కేటీఆర్‌ పేర్కొన్నారు. అలాగే, రైతుబంధు రెండో విడత నిధుల విడుదల ఆలస్యం రైతుల కష్టాలను పెంచిందన్నారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో 420 హామీలు పెట్టి ప్రజలను మోసగించిందని విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు, లక్ష కోట్ల బడ్జెట్‌ వంటి హామీలను అమలు చేయలేదని, అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నట్టేనని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రతి హామీపై బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని, ప్రజల సమస్యలపై శాసనసభ, మండలిలో బలమైన గొంతు వినిపిస్తామని హామీ ఇచ్చారు. ఎల్పీ సమావేశంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్‌ ప్రత్యేకంగా దిశానిర్దేశం ఇచ్చారని, రాష్ట్ర ప్రజల ఆవేదనను ప్రభుత్వానికి ముక్కుసూటిగా వ్యక్తపరచేందుకు ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్‌ సిద్ధంగా ఉందని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

Extra-Marital Affair: రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త.. భార్య ముందే ప్రియుడికి దేహశుద్ధి..!