Ashok Chakra 24 Spokes: అశోక చక్రంలో ఉన్న 24 ఆకుల (గీతలు) అర్థం ఏంటో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashok Chakra 24 Spokes: ఆగస్టు 15, 2025 న భారత్ తన 79వ స్వాతంత్య్ర దినోత్సవంను ఘనంగా జరుపుకోనుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల మూడు రంగులకు సంబంధించి అందరికీ తెలిసినా, పతాక మధ్యభాగంలో ఉన్న అశోక చక్రం, దాని 24 ఆకుల (గీతలు) వెనుక ఉన్న అర్థం చాలా మందికి అంతగా తెలియదు. పతాకంలోని తెలుపు రంగు మధ్య పట్టీపై నావీ బ్లూ రంగులో ఉన్న ఈ చక్రం, ధర్మచక్రం (Dharmachakra)గా ప్రసిద్ధి చెందింది. ఇది భారతదేశపు ప్రాచీన వారసత్వాన్ని గుర్తు చేసే ప్రతీక. అశోక చక్రం సారనాథ్‌లోని సింహస్తంభం (Sarnath Lion Capital) నుండి స్ఫూర్తి పొందింది. అది మన జాతీయ చిహ్నం కూడా. 1947 జూలై 22న దీన్ని అధికారికంగా భారత పతాకంలో చేర్చారు.
HCA: బీసీసీఐ నుంచి హెచ్‌సీఏకు రూ. 240 కోట్లు.. 20 రోజుల్లో రూ. 200 కోట్లు మాయం..!
Also Read
- PG Medical Seats: పీజీ వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొత్తగా 161 పీజీ సీట్లు మంజూరు..
- Train Fire Accident: కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఐదు బోగీలకు మంటలు!
- Gold & Silver Price Drop: ధన త్రయోదశి వేళ గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- Saltలో ఈ ఒక్క మార్పు చేయండి.. లక్షలాది ప్రాణాలు కాపాడండి! పరిశోధనలో కీలక విషయాలు
భారత పతాక నియమావళి (Flag Code of India, 2002) ప్రకారం.. మధ్య పట్టీ తెలుపు రంగులో ఉండి, దాని మధ్యలో నావీ బ్లూ రంగులో 24 సమాన ఆకుల (గీతలు) గల అశోక చక్రం ఉండాలి. ఇది స్క్రీన్ ప్రింట్, స్టెన్సిల్, ఎంబ్రాయిడరీ వంటి పద్ధతుల్లో స్పష్టంగా ఇరువైపులా కనిపించేలా ఉండాలి. అశోక చక్రంలోని 24 ఆకుల (గీతలు) నీతిమంతం, న్యాయం, నిజాయితీ, మంచి పాలన వంటి 24 విలువలకు ప్రతీక. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో పాత త్రివర్ణ పతాకంలో చరఖా ఉండేది. అది స్వావలంబన, వలస పాలనకు వ్యతిరేక పోరాటానికి ప్రతీక. స్వాతంత్య్ర అనంతరం చరఖా స్థానంలో అశోక చక్రాన్ని ఉంచారు. ఇది జీవితం ఎప్పుడూ కదలికలో ఉండాలి.
వీటిని వివిధ రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఎలా అంటే.. హిందూ సంప్రదాయంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కొనసాగించిన 24 ఋషులను సూచిస్తాయి. అలాగే వేద మంత్రాలలో గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలకు ప్రతీకగా చెబుతారు. అంతేకాకుండా.. రోజులోని 24 గంటలకు సంకేతం, జీవితం ఎప్పుడూ చలనంలో ఉండాలని గుర్తు చేస్తుంది.
Neena Gupta: జరిస్కి సమస్య ఛేదన.. ప్రతిష్ఠాత్మక ‘రామానుజన్ ప్రైజ్’ సొంతం!
త్రివర్ణ పతాకంలోని కాషాయం రంగు ధైర్యం, త్యాగంలకు ప్రతీకలు కాగా, తెలుపు శాంతి, సత్యంలకు ప్రతీకలు. అలాగే ఆకుపచ్చ సస్యశ్యామలం, అభివృద్ధిలకు ప్రతీకలు. ఇక నావీ బ్లూ అశోక చక్రంలోని 24 ఆకుల (గీతలు) అర్థం ఇలా ఉన్నాయి.

* ప్రేమ (Love)
* ధైర్యం (Courage)
* సహనం (Patience)
* శాంతి (Peace)
* త్యాగం (Sacrifice)
* కరుణ (Compassion)
* సత్యం (Truth)
* ధర్మం (Righteousness)
* న్యాయం (Justice)
* సౌహార్దం (Harmony)
* సమానత్వం (Equality)
* సత్సంకల్పం (Goodwill)
* స్నేహం (Friendship)
* స్వీయ నియంత్రణ (Self-control)
* ఉదారత (Generosity)
* స్వాతంత్య్రం (Freedom)
* నీతి (Morality)
* సహకారం (Cooperation)
* కృతజ్ఞత (Gratitude)
* క్షమ (Forgiveness)
* జాగ్రత్త (Alertness)
* శ్రద్ధ (Devotion)
* కృషి (Effort/Diligence)
* ప్రగతి (Progress)
ఇలా, భారత త్రివర్ణ పతాకం ప్రతి అంశం మన చరిత్ర, తత్త్వం, భవిష్యత్తు దిశను ప్రతిబింబిస్తూ ఒక సమగ్ర కథ చెబుతుంది.
తాజావార్తలు
-
PG Medical Seats: పీజీ వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొత్తగా 161 పీజీ సీట్లు మంజూరు..
-
Scene: సూర్య స్పీడ్‌కు కోలీవుడ్ షాక్.. ఏడాదిలో హ్యాట్రిక్ కొట్టేసినట్లేనా?
-
Train Fire Accident: కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఐదు బోగీలకు మంటలు!
-
Lokesh Kanagaraj: సూర్య, కార్తీలకు లోకేష్ ‘హ్యాండ్’? స్టార్ బ్రదర్స్‌ను పక్కనపెట్టి బన్నీ వెనుక పడ్డాడా!
-
Gold & Silver Price Drop: ధన త్రయోదశి వేళ గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
ట్రెండింగ్
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!