KTR : ఫార్ములా ఈకేసులో హైకోర్టులో ఏం తీర్పు వస్తుందో చూద్దామని, అవినీతే లేనప్పుడు.. కేసు ఎక్కడదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పు అని, 7న ఈడీ విచారణకు హాజరుపై మా లాయర్లు నిర్ణయిస్తారన్నారు. ఏసీబీ కేసులో అస్సలు పస లేదని, నాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉందని, ఫార్ములా ఈ కేసు లొట్టపీసు కేసు అని ఆయన విమర్శించారు. పాపం.. నన్ను ఏదో రకంగా జైలుకు పంపాలని ప్రభుత్వం చూస్తోందని, నాపై ఇది ఆరో ప్రయత్నం.. రేవంత్ కు ఏమి దొరకటం లేదన్నారు కేటీఆర్. 600కోట్లు సంగతి అటుంచితే.. ఒక్క పైసా కూడా అవినీతి లేదని, జడ్జి గారు అడిగే ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానం లేదన్నారు. రేసు కావాలని నేను నిర్ణయం తీసుకున్న.. వద్దనేది రేవంత్ నిర్ణయం.. ఇద్దరి నిర్ణయాలపై కేబినెట్‌లో చర్చ జరగలేదన్నారు. నాపై కేసు పెడితే.. రేవంత్ పై కూడా కేసు పెట్టాలని, రేవంత్ రెడ్డి.. ఒక ముఖ్యమంత్రినా? పల్లెటూరు భాష లో చెప్పాలంటే ఇది ఒక లొట్టపీసు కేసు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Minister Ratnesh Sada: మార్నింగ్ వాక్‌కు వెళ్లిన మంత్రిని ఢీకొన్న ఆటో..
అంతేకాకుండా..’కేసీఆర్ ప్రజల్లో ఎప్పుడూ రావాలో అప్ప్పుడే వస్తారు.. ఎన్నికల ముందు కేసీఆర్ చెప్పారు. ఓడిపోతే ఏంట అని. స్పీకర్ బాధ్యత కేసీఆర్ కి ఫోన్ చేయడం. పార్టీ మరీనా ఎమ్మెల్యే ల పై సంక్రాంతి తరువాత సుప్రీంకోర్టు కి వెళ్తాము. ఈ సంవత్సరం ఉప ఎన్నికల రావొచ్చు.. RRR లో 12 వేల కోట్ల కుంభకోణం జరుగబోతుంది.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుంభకోణం చేయబోతున్నారు. ఖాజా గూడ లో ఉన్న పేద వాళ్ళను రోడ్ పై వేశారు.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం. సుప్రీంకోర్టు నుంచి ఇప్పటికే ముఖ్యమంత్రి కి తిట్లు పడ్డావి. లక్ష 38 వేల కోట్ల అప్పులో వేల కోట్ల రూపాయలు ఢిల్లీ కి పోతున్నవి. పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల తో డబ్బులు వసూలు చేసి ఢిల్లీ కి పంపుతున్నారు? బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ. ఏడాది మెదటి హాఫ్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమం. తర్వాత గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి కమిటీలు పూర్తి చేస్తాం. పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు వచ్చే అక్టోబర్ వరకు సమయముంది. పార్టీ నేతలకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపిస్తాం. రైతుభరోసాతో రేవంత్ సర్కార్ పై ప్రజల్లో తిరుగుబాటు రాబోతుంది. రైతుభరోసా కొందరకికే ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. రైతులకు సెల్ఫ్ డిక్లరేషన్ ఎందుకు? బ్యాంకులను ముంచేటోళ్ళకే సెల్ఫ్ డిక్లరేషన్ లేదు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజిస్ట్రేషన్లు ఇవ్వాలని రేవంత్ కు లేదు. 42శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వమే కోర్టులో కేసులు వేయిస్తోంది. ఉద్యోగస్తులు, పాన్ కార్డ్ ఉన్నవాళ్ళకు రైతుబరోసా ఎగ్గొట్టే ప్రయత్నం’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.