NTV Telugu Site icon

KTR : అడ్డగోలు హామీలు ఇచ్చి.. ఇప్పుడు అధికారులను బలిపశువులను చేస్తున్నారు

Ktr Revanthr Eddy

Ktr Revanthr Eddy

KTR : హన్మకొండ జిల్లా బీఆర్ఏస్ పార్టీ కార్యాలయంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్‌లో స్వాగతం పలికిన జిల్లా కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. గత ఏడాది సరిగ్గా ఇదే రోజు కామారెడ్డి సభలో బి సి డిక్లరేషన్ ప్రకటించి ఏడాది పూర్తయిందని, బీసీ డిక్లరేషన్ హామీలు ఏమయ్యాయి ఒక్కటైనా హామీ చేసిందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆయన అన్నారు. చేతి గుర్తుకు ఓటు వేస్తే చేతి వృత్తుల వాళ్లకు గొంతు కోసిన పాలన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సాగుతోందని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో పథకాలు ఉండేది కులవృత్తులను బలోపేతం చేసేలాగా ఎన్నో పథకాలు తీసుకొచ్చావన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం.. బీసీ వర్గాలకు తీరని అన్యాయం చేస్తుందని, రేవంత్ రెడ్డి రాగానే బీసీ బంద్ బంద్ అయింది రైతుబంధు బంద్ అయిందన్నారు కేటీఆర్‌. బీసీల ఓట్ల కోసం ఇప్పుడు కులగనన అని కొత్త నినాదం ఎత్తుకున్నారని, సర్వే కోసం ఇంటికి వెళ్తే అధికారులను జనం నిలదీస్తున్నారన్నారు కేటీఆర్‌.

Accident: ఆలయానికి వెళ్లివస్తుండగా వాహనం బోల్తా.. 15 మందికి గాయాలు

అంతేకాకుండా…’బీసీలకు సబ్ ప్లాన్ అని చెప్పావ్ ఒకటన్న అమలు అయ్యాయా. కుల గణన కోసం కావాలంటే ఆ ప్రశ్నలను తగ్గించండి. కేవలం కులాలకు సంబంధించిన సమాచారం మాత్రమే తీసుకోండి. ఆర్థిక అంశాలను ఆ ఫార్ములా నుంచి తొలగించండి. కులగర్ల కోసం చేస్తే కులాలకు సంబంధించిన వివరాలు సేకరించేలాగా ఫామ్ రూపొందించండి. కుల గణన చేసిన 42% రిజర్వేషన్లు అమలు అయ్యేలాగా చేయండి. మా ఎమ్మెల్యేల మీద దాడులు చేయడం కాదు ఇచ్చిన మాటను మీద నిలబెట్టుకో. ఇదే వరంగల్లో రైతుల డిక్లరేషన్ ప్రకటించారు. ఏ మార్కెట్ పోదాం రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. రాష్ట్రంలో రైతులకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నట్లు మహారాష్ట్రలో ఈ ముఖ్యమంత్రి బోగస్ మాటలు చెబుతున్నాడు. రైతులకు బోనస్ ఎక్కడ ఇచ్చావు ఒక్కచోటన్న ఇచ్చావా చూపిస్తావా ఏ మార్కెట్ పోదాం. నువ్వు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే వరకు నిలదీస్తూనే ఉంటాం నిన్ను వెంటాడుతూనే ఉంటాం. కేసులు పెట్టుకున్న పాసులు పెట్టుకున్న భయపడేది లేదు.

Mohammad Rizwan: టాస్, ప్రెజెంటేషన్‌కు మాత్రమే కెప్టెన్‌ని- పాక్ కెప్టెన్..

కులగణనాలో అధికారులను నిలదీయండి.. అడగండి… దీని వివరాలు దేనికి ఎందుకు అని అడగండి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అడగండి.. 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతనే ఈ వివరాలు తీసుకోండని జనం నిలదీయండి.. నిలదీయండి వివరాలు రాయించుకోండి. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు మీరు అమలు చేస్తారని కుల గణన కోసం వస్తున్న అధికారులను రాసి ఇవ్వమని అడగండి నిలదీయండి. బాంబుల శాఖ మంత్రి గురించి మీరు అడుగుతున్నాయి.. ఆయనకు బాంబుల శాఖ అని పేరు పెట్టండి.. వాళ్లని మాత్రం వదిలిపెట్టడం కచ్చితంగా నిలదీస్తాం.. విజయోత్సవాలు చేయాలా వారవోత్సవాలు చేయాలనేది మేము నిర్ణయిస్తాం.. డిసెంబర్ 9 కి ఏడాది పూర్తయిన నేపథ్యంలో వాళ్లు ఎలా వైఫల్యం చెందారో మేము కూడా అన్ని వివరాలు సేకరించి వైఫల్య వారోత్సవాలను నిర్వహిస్తాం..’ అని కేటీఆర్‌ అన్నారు.