Kriti Sanon : కెరీర్ ప్రారంభంలో ఎంతో ఇబ్బంది పడ్డాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృతి సనన్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సూపర్ స్టార్ మహేష్ నటించిన “వన్ నేనొక్కడినే’ సినిమాతో ఈ భామ టాలీవుడ్ కి పరిచయం అయింది. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. దీనితో ఈ భామకు బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. ఈ భామ బాలీవుడ్ లో వరుస చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ భామకు ‘మీమీ’ సినిమాలో ఆమె అద్భుతమైన నటనకు గానూ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా లభించింది.అయితే తన కెరీర్ ప్రారంభ రోజుల్లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను కృతి సనన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ర్యాంప్ వాక్ సమయంలో ఓ కొరియోగ్రాఫర్ తనతో ఎంతో దురుసుగా ప్రవర్తించారంటూ అప్పటి చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంది ఈ భామ.తాను ఎంచుకున్న సినీ ఫీల్డ్ లో అవకాశాలు రాకపోతే ఉన్నత చదువులను కొనసాగించాలని ఇండస్ట్రీకి రాకముందే ఆమె నిర్ణయించుకున్నట్లు తెలిపింది.. అందుకే ఒకవైపు మోడలింగ్ చేస్తూనే మరోవైపు పోటీ పరీక్షలకు కూడా శిక్షణ తీసుకునేదానిని అని కృతి తెలిపింది.. నా మొదటి ర్యాంప్ వాక్‌లో ఎదుర్కొన్న చేదు అనుభవం నాకిప్పటికీ కూడా గుర్తుంది.
మోడలింగ్‌లోకి అడుగుపెట్టిన మొదట్లో అక్కడి వాతావరణం, వ్యక్తుల గురించి నాకు అంతగా తెలియదు. దీంతో నేను కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను. ఒకరోజు హైహీల్స్ వేసుకుని నేను గడ్డిలో నడవాల్సి వచ్చింది. ఆ చెప్పులు గడ్డిలో కూరుకుపోయి ఇబ్బంది పడ్డాను. దీంతో అక్కడే ఉన్న కొరియోగ్రాఫర్ నాతో దురుసుగా ప్రవర్తించింది. అందరి ముందు నన్ను దారుణంగా తిట్టింది. ఆ సమయంలో నాకు ఎంతో బాధ కలిగింది.. కానీ దేనికీ వెనుకడుగు వేయలేదు ” అంటూ అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు కృతి.. అలా ప్రవర్తించిన కొరియోగ్రాఫర్‌తో మరోసారి నేను పనిచేయలేదని కృతి తెలిపారు.ఇక మోడలింగ్ చేస్తోన్న సమయంలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు తో కలిసి నటించే అవకాశం వచ్చినట్లు కృతి సనన్ తెలిపారు. అలాగే ‘హీరోపంటి’ చిత్ర యూనిట్ కూడా అదే సమయంలో తనని సంప్రదించినట్లు తెలిపారు.. ఈ రెండు సినిమాల షూటింగ్ గ్యాప్‌లో తాను పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయినట్లు కృతి తెలిపారు. భవిష్యత్తుకు సంబంధించి ఎప్పుడూ రెండు ప్లాన్స్ ఉండాలని కృతి వివరించారు. ప్లాన్ ఏ వర్క్ ఔట్ అవ్వకపోతే ప్లాన్ బీ అమలు చేయాలని ఆమె తెలియజేశారు
Also Read
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
- T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
- Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
తాజావార్తలు
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..