NTV Telugu Site icon

Krithi Shetty : బేబమ్మ ఆశలన్నీ ఆ హీరో మీదనే !

New Project 2024 10 24t105857.712

New Project 2024 10 24t105857.712

Krithi Shetty : కొంత మంది హీరోహీరోయిన్లు ఒక్క సినిమాతోనే స్టార్ డమ్ సంపాదించుకోగలుగుతారు. ఆ తర్వాత వరుస సినిమా ఛాన్సులతో బిజీ బిజీగా గడుపుతారు. సరైన కథలు, సినిమాల ఎంపిక లేకపోతే ఎంత వేగం స్టార్ డమ్ వచ్చిందో అంతే వేగంగా పడిపోతుంది. దానికి చక్కటి ఉదాహరణ కృతిశెట్టినే. తన తొలి సినిమా ఉప్పెన లాంటి 100 కోట్ల హిట్ అందుకున్న అమ్మడు తర్వాత బేబమ్మగా తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ క్రేజ్ తోనే వరుస అవకాశాలు కూడా అందుకుంది. ఐతే కృతి శెట్టికి మాత్రం లక్ రివర్స్ అయ్యింది. చేసిన సినిమాలన్నీ కూడా నిరాశ పరిచాయి. దాంతో ఎలా అయితే ఒక్క సినిమాతో స్టార్ రేంజ్ కి వెళ్లి అందరి నోళ్లలో చర్చనీయాంశంగా మారింతో అంతే త్వరగా కెరీర్లో డౌన్ ఫాల్ అయింది. వరుస యువ హీరోలందరితో సినిమాలు చేసినప్పటికీ ఒక్కటంటే ఒక్క హిట్టు లేక కెరీర్ గ్రాఫ్ పడిపోయేలా చేసుకుంది కృతి శెట్టి.

Read Also:Gold Rate Today: హమ్మయ్య.. ఎట్టకేలకు తగ్గిన బంగారం ధర! నేటి రేట్లు ఇవే

ఇక ఇప్పుడు అమ్మడికి తెలుగులో అవకాశాలు లేకపోయే సరికి పక్క ఇండస్ట్రీల వైపు చూస్తోంది. పక్కనే ఉన్న కోలీవుడ్ కి బేబమ్మ షిఫ్ట్ అయ్యింది. అక్కడ స్టార్ హీరో జయం రవితో ఒక సినిమా ఆఫర్ అందుకున్న కృతి శెట్టి ప్రదీప్ రంగనాథ్ తో LIK సినిమాలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలతో తమిళ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఐతే సినిమాలతో పాటు ఈమధ్య ఫోటో షూట్స్ తో కూడా అమ్మడు తెగ సందడి చేస్తుంది. ఈ మధ్య స్లీవ్ లెస్ ఫోటో షూట్స్ తో యూత్ ను టార్గెట్ చేసింది. తెలుగు సినిమా తొలి ఆఫర్ ఇచ్చి 100 కోట్ల సినిమా ఇచ్చినా కథల ఎంపికలో జాగ్రత్త పడకపోవడంతో అమ్మడు త్వరగానే తన ఫాం కోల్పోయింది. ఐతే టాలీవుడ్ పక్కన పెట్టి ఇప్పుడు తన ఫోకస్ అంతా కూడా కోలీవుడ్ మీద పెట్టింది బేబమ్మ. అక్కడ రెండు మూడు సినిమాలు చేస్తుండగా ఒక్క హిట్ పడినా సరే తన మకాం ని చెన్నైకు మార్చాలని చూస్తుంది అమ్మడు.

Read Also:Salaar: ఇండియన్ ఓటీటీ హిస్టరీలో సలార్ భారీ రికార్డ్

ఈమధ్యనే మలయాళంలో కూడా టోవినో థామస్ తో ఒక సినిమా చేసింది కృతి శెట్టి. ఆ సినిమా మీద కూడా భారీ అంచనాలు పెట్టుకోగా మలయాళంలో సోసోగా ఆడిన ఆ మూవీని తెలుగు, తమిళ ఆడియన్స్ పట్టించుకున్న పాపాన పోలేదు. మరి తెలుగు లో అవకాశాలు లేవని తమిళ, మలయాళంలో గట్టి ప్రయత్నాలు చేస్తోంది.

Show comments