Sangameshwara temple: కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది.. ఇప్పటికే పెద్ద ఎత్తున శ్రీశైలం డ్యామ్‌కు చేరుతుంది వరదనీరు.. ఇక, నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని సంగమేశ్వర ఆలయ గర్భాలయంలోని వేప దారు శివలింగానికి తాకింది కృష్ణమ్మ.. సంగమేశ్వర ఆలయాన్ని కృష్ణా జలాలు చుట్టుముట్టడంతో ఆలయం బయట వేప దార లింగానికి పూజలు చేశారు.. ఈ సంవత్సరం చివరిసారిగా వేప దారు శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ పురోహితులు తెలకపల్లి రఘు రామ శర్మ..
Read Also: AP Cyber Crime: రెట్టింపు డబ్బులంటూ మోసం.. మహిళ ఆత్మహత్య..
సంగమేశ్వర ఆలయం జలదివాసమైనది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది నుంచి శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా చేరడంతో ఆలయం దగ్గరకు నీరు చేరుకున్నది. కృష్ణా నదికి చీర సారె సమర్పించి, మంగళ హారతి ఇచ్చారు. గర్భాలయంలోని వేపదారు శివలింగానికి ఆలయ పురోహితులు పూజలు నిర్వహించారు. ప్రవాహం ఇలాగే కొనసాగితే మరో మూడు రోజుల్లో గుడి పూర్తిగా కృష్ణమ్మ ఒడిలోకి చేరుతుందని భావిస్తున్నారు. అదే జరిగితే మళ్లీ స్వామివారి దర్శనం కోసం ఎనిమిది నెలలు ఆగాల్సిందే. వరద నీటిలో మునిగిన తర్వాత సంగమ తీరం ఒక సముద్రాన్ని తలపిస్తుంది. మరో రెండు రోజుల్లో కృష్టమ్మ ఒడిలోకిసంగమేశ్వరుడు చేరే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచంలో ఏడు నదులు ఒకేచోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం. ఈ నదులన్నీ కలసి జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తి పీఠం అయిన శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ చివరికి సముద్రంలో కలుస్తాయి. వరద ప్రభావం ఇలాగే కొనసాగితే మరో మూడు రోజుల్లో ఆలయం పూర్తిగా కృష్ణమ్మ ఒడిలోకి చేరుతుందని చెబుతున్నారు ఆలయ పూజారి.