Vaibhav Drop: ‘వైభవ్ సూర్యవంశీని తొలగించడం ఏంటి..? అతడి కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీశారు’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లాండ్ పర్యటనలో వైభవ్ సూర్యవంశీని తుది జట్టు నుంచి పక్కన పెట్టడంపై మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్, టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత తెలివితక్కువదనంతో కూడుకున్నదని, కేవలం 15 ఏళ్ల వయసున్న యువ ఆటగాడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉందని విమర్శించారు. అంతర్జాతీయ స్థాయిలో తొలిసారి యూకే పర్యటనకు ఎంపికైన వైభవ్, ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో అవకాశం దక్కించుకోలేకపోయాడు. అయితే సంజూ శామ్సన్ విఫలం కావడంతో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20ల్లో మేనేజ్మెంట్ వైభవ్‌ను బరిలోకి దించింది. లభించిన మూడు మ్యాచుల్లో మొత్తం 42 పరుగులు చేసిన వైభవ్, ప్రతిసారీ రెండంకెల స్కోరు దాటి మంచి ఆరంభాలు సాధించినప్పటికీ భారీ ఇన్నింగ్స్‌లుగా మలచలేకపోయాడు. దీనితో మూడో మ్యాచ్ తర్వాత అతనిని పక్కనపెట్టి మళ్లీ శామ్సన్ను జట్టులోకి తీసుకున్నారు.
ఈ నిర్ణయాన్ని తప్పుపట్టిన శ్రీకాంత్, తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. వైభవ్ షాటింగ్ రేంజ్, అద్భుతమైన టాలెంట్‌ను కొనియాడారు. వైభవ్ సాధించిన అరంగేట్రం ఎంతో ప్రత్యేకమైనదని, కేవలం మూడు అవకాశాల ఆధారంగానే అతని కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీసేలా డ్రాప్ చేయడం సముచితం కాదని పేర్కొన్నారు. ఇంగ్లాండ్ సిరీస్ ముగిసిన వెంటనే వైభవ్ నేరుగా రాజస్థాన్ రాయల్స్ క్యాంప్‌నకు వెళ్లి, షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కొనే క్రమంలో తీవ్రంగా శ్రమించాడని శ్రీకాంత్ అతని నిబద్ధతను మెచ్చుకున్నారు.
Also Read
- Supreme Court: సీజేపీ నిరసనకారుడికి నోటీసు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
- YS Jagan: గట్టిగా పోరాడదాం.. జరిగేది కురుక్షేత్ర సంగ్రామం.. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు!
- Padayatra 2.0: పాదయాత్ర 2.0పై వైఎస్ జగన్ క్లారిటీ!
- Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
ఇంగ్లాండ్ పర్యటన అనంతరం జింబాబ్వే సిరీస్‌లో బరిలోకి దిగిన వైభవ్ కేవలం 18 బంతుల్లోనే మెరుపు అర్ధశతకం సాధించి, అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత పిన్న వయసులో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. సాధారణంగా ఇలాంటి సమయాల్లో ఏ ఆటగాడైనా జట్టులో స్థానం పదిలపరుచుకునేందుకు ఒకేసారి పెద్ద షాట్లకు పోకుండా సింగిల్స్, డబుల్స్ ఆడేందుకు ప్రయత్నిస్తాడని, కానీ వైభవ్ ఎటువంటి భయం లేకుండా 250 స్ట్రైక్ రేట్‌తో విరుచుకుపడి పరుగులు సాధించాడని శ్రీకాంత్ ప్రశంసించారు. ఫలితాల గురించి చింతించకుండా సత్తా చాటే ఈ తరహా క్రీడాస్ఫూర్తి, నిబద్ధతే వైభవ్‌ను ఎంతో ప్రత్యేకమైన క్రీడాకారుడిగా నిలబెడుతుందని శ్రీకాంత్ వివరించారు.
తాజావార్తలు
-
Tollywood Stars : ఆరోగ్యాన్ని పక్కన పెట్టి షూటింగ్స్‌కు పరుగులు ఎందుకు?
-
Supreme Court: సీజేపీ నిరసనకారుడికి నోటీసు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
-
The Paradise: ప్యారడైజ్‌కు ప్యాకప్.. ఇక థియేటర్లలో నాని మాస్ రచ్చే!
-
CNR Rao: భారతరత్న శాస్త్రవేత్త సి.ఎన్.ఆర్. రావుకు ఎస్ఐఆర్ నోటీసు.. కారణం ఇదే!
-
Prabhas Fauzi: ఫౌజీ విడుదలపై కొత్త డౌట్స్.. చైతు, దుల్కర్, విశ్వక్ సినిమాల రిలీజ్‌తో డార్లింగ్ ఫ్యాన్స్‌లో టెన్షన్!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!