Former Cricketer: వెళ్లి ఇండియా పిచ్‌లపై ఆడుకో.. నువ్వు విదేశాల్లో పనికిరావు.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ని ప్లేయింగ్ ఎలెవన్ (XI)లోకి తీసుకోవడంపై భారత మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్‌లో బిష్ణోయ్ 4 ఓవర్లలో ఏకంగా 60 పరుగులు సమర్పించుకున్నాడు. ముఖ్యంగా అతను వేసిన 17వ ఓవర్లో ఇంగ్లాండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్ చెలరేగి 29 పరుగులు రాబట్టాడు. ఈ ఒక్క ఓవర్ మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. అంతిమంగా ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ నేపథ్యంలో టీమ్ మేనేజ్మెంట్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నిర్ణయాలపై శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్లో ఘాటుగా స్పందించారు. బిష్ణోయ్ వేసిన ఆ 17వ ఓవర్ అత్యంత పేలవంగా సాగిందని, బెథెల్ అతడిని ముక్కలు ముక్కలు చేశాడని శ్రీకాంత్ అన్నారు. ఆ ఓవరే భారత్ చేతుల్లోంచి మ్యాచ్‌ను లాగేసుకుందని విమర్శించారు.
Also Read
- Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (RR) తరఫున బిష్ణోయ్ కనీసం సగం మ్యాచ్‌లు కూడా ఆడలేదని, అలాంటి ఆటగాడిని నేరుగా జట్టులోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఆటగాళ్ల పాత రికార్డులను చూసి ఎంపిక చేయడం సరికాదని, ప్రస్తుత ఫామ్‌ను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని హితవు పలికారు.
కుల్దీప్ యాదవ్ ప్రస్తావన..
కుల్దీప్ యాదవ్ ఇటీవల ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో అతడిని ప్లేయింగ్ ఎలెవన్ నుండి తొలగించడం సరైనదేనని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. అయితే, బిష్ణోయ్ కంటే కుల్దీప్ను కనీసం స్క్వాడ్‌లోనైనా ఉంచి ఉండాల్సిందని పేర్కొన్నారు.
ఇంగ్లాండ్ పిచ్‌ల వాతావరణ పరిస్థితులకు ముగ్గురు స్పిన్నర్లు అవసరం లేదని శ్రీకాంత్ స్పష్టం చేశారు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ రూపంలో ఇద్దరు స్పిన్నర్లు సరిపోతారని.. బిష్ణోయ్‌కు బదులుగా యువ ఆటగాడు ప్రిన్స్ యాదవ్ కు అవకాశం ఇచ్చి ఉంటే జట్టు సమతుల్యత బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. బిష్ణోయ్ కేవలం భారత పిచ్‌లపైనే ప్రభావం చూపగలడని తేల్చి చెప్పారు.
తాజావార్తలు
-
Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!