ఢిల్లీలో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవికి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ‘పద్మవిభూషణ్’ ను ప్రదానం చేశారు. కార్యక్రమం ముగించుకుని ప్రత్యేక విమానంలో బేగంపట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సంద్రాభంగా మెగాస్టార్ చిరు మాట్లాడుతూ.. ”పద్మవిభూషణ్ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. తనతో కలిసి సినిమా చేసిన దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, టెక్నీషియన్ల వల్లే తాను ఈ అవార్డు అందుకోగలిగాను., నేను వారిని ఎప్పటికీ మరచిపోలేను.. అందరికి ధన్యవాదాలు” అంటూ మాట్లాడారు.
Also Read: CSK vs GT: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్..
వీటితోపాటు నేను ఏ రాజకీయ పార్టీకి చెందినవాడిని కాదు, ఈ ఎన్నికల గురించి మాట్లాడను. పిఠాపురంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ గెలవాలని కోరుకుంటున్నాను. పవన్ కు నా మద్దతు, నా కుటుంబ మద్దతు ఎప్పుడూ ఉంటుంది.. పిఠాపురంలో నేను ప్రచారం చేయను. పవన్ కూడా నన్ను ప్రచారానికి రావాలని ఎప్పుడూ అడగలేదు అంటూ మాట్లాడారు. దేశంలో ప్రతిష్టాత్మకమైన అవార్డు ‘భారతరత్న’ అవార్డు సీనియర్ ఎన్టీఆర్ కు వస్తే చాలా సంతోషమని ఆయన పేర్కొన్నాడు. ప్రభుత్వ సహకారంతో ఈ విషయం త్వరగా జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.