నారా భువనేశ్వరి నిజం గేలవాలి యాత్రపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నాడని, భువనేశ్వరి కూడా నిజం గెలవాలనుకుంటే చంద్రబాబు జీవితంలో బయటకు రాడన్నారు కొడాలి నాని. చంద్రబాబు కుటుంబమంతా అవినీతి సొమ్ముతో మునిగిపోయిందని కొడాలి నాని విమర్శించారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఏ స్థితిలో ఉన్నారు భువనేశ్వరి ఏ స్థాయిలో ఉంది…. రెండు ఎకరాలతో ప్రారంభమైన చంద్రబాబు ప్రస్థానం నేడు 2వేల కోట్లు దాటిందని కొడాలి నాని వ్యాఖ్యానించారు.
Also Read : Israel-Hamas War: హమాస్ గ్రూపుకు సంబంధించిన వివరాలు మాకు కావాలి..
40 రోజుల్లో ఢిల్లీ లాయర్లకు 35 కోట్లు ఏ విధంగా ఫీజులు కట్టారని, కష్టపడి పొలం దున్నగా వచ్చిన డబ్బుతోనే ఏడు కోట్లతో రూపొందించిన బస్సులో యాత్ర చేస్తున్నారా ? అని కొడాలి నాని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో కూడా పవన్ కల్యాణ్ తెరవనుక నుండి టీడీపీకి మద్దతుగా ఉన్నాడు – ఇప్పుడు ముసుగు తొలగింది అంతే కొడాలి నాని విమర్శించారు. అంతేకాకుండా.. చంద్రబాబు కోసమే పవన్ కల్యాణ్ జనసున్నా పార్టీ పెట్టారని, చంద్రబాబు వారసుడు లోకేష్ సమర్థుడు, మగాడు అయితే ఇంట్లో మహిళలు రోడ్లపైకి ఎందుకు వస్తారన్నారు. లోకేష్ పప్పు అని మరోసారి రుజువైందని, ఢిల్లీ పారిపోయి తల్లిని రోడ్లపై తిప్పుతున్నాడంటూ కొడాలి నాని విమర్శలు గుప్పించారు.
Also Read : WHO: గాజాలో విచ్ఛిన్నమవుతున్న ఆరోగ్య వ్యవస్థ.. ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ చేయాలి