Konda Surekha : బీఆర్‌ఎస్ పార్టీపై మంత్రి కొండా సురేఖ ఘాటు విమర్శలు చేశారు. సిఎస్‌ఆర్ నిధులతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొంటూ, తాను ఎప్పుడూ మంత్రులు కమిషన్ తీసుకుంటారని మాత్రమే వ్యాఖ్యానించానని, కాంగ్రెస్ మంత్రులను ఉద్దేశించి కాదని స్పష్టంచేశారు. అయితే తన మాటలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌కు చెందిన కొంతమంది నేతలు తప్పుడు వీడియో ఎడిటింగ్‌తో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను చెప్పిన మాటల్ని అసంపూర్ణంగా ప్రచారం చేసి బద్నాముచేయాలని ప్రయత్నం జరుగుతోందని ఆమె పేర్కొన్నారు. ‘‘నేను ఎవరు అన్నా వాళ్లను తానే అనుకున్నారు… కాంగ్రెస్ మంత్రులు అని నేనెప్పుడూ అనలేదు,’’ అని కొండా సురేఖ స్పష్టం చేశారు.
23 Iravai Moodu Review: 23 ఇరవై మూడు రివ్యూ
‘‘బీఆర్‌ఎస్ నేతలు, మంత్రులుగా పనిచేసిన వారు తన ఆస్తులపై సెల్ఫ్ ఎంక్వయిరీ చేయించుకోండి. మంత్రి అయ్యే ముందు మీ ఆస్తి ఎంత, ఇప్పుడు ఎంత పెరిగిందో చెబితే నిజాలు వెలుగులోకి వస్తాయి,’’ అని సురేఖ ఢీగా సవాల్ విసిరారు. ‘‘కవిత ఇల్లు లేదంటారు, కానీ పెద్ద ఇల్లు ఎలా వచ్చింది? కేటీఆర్ ఫార్మ్ హౌస్ ఎలా సాధించారు? అవినీతికి పాల్పడకపోతే ఈ స్థాయికి ఎలా వచ్చారు?’’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు పారదర్శకంగా, అర్హులకే అందుతున్నాయని స్పష్టం చేశారు. ‘‘పేద నియామకాల్లో పూర్తిగా పరిశీలన జరుగుతున్న తర్వాతే నియామకాలు చేస్తున్నాం. కానీ బీఆర్‌ఎస్ నేతలు తప్పుడు ప్రచారాలతో పథకాలను ఎడాపెడా విమర్శిస్తున్నారు,’’ అని విమర్శించారు.
అంతేకాకుండా.. ‘సెక్రటేరియట్‌ను బీఆర్‌ఎస్ పూర్తిగా చెడగొట్టింది. అక్కడ మేమేం మాట్లాడలేని పరిస్థితిని బీఆర్‌ఎస్ ప్రభుత్వం సృష్టించింది. ప్రతి చిన్న ఫైల్‌కే డబ్బులు తీసుకునే అలవాటు తెచ్చింది అని మండిపడ్డారు. తనపై కొనసాగుతున్న తప్పుడు ప్రచారాలను తట్టుకోలేక పోతున్నట్లు పేర్కొంటూ, దీన్ని వెంటనే ఆపకపోతే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ‘‘మేము ఏం మాట్లాడినా భూతంగా చూస్తున్నారు. ప్రజల ముందు వాస్తవాలు చెప్పినంత మాత్రాన ఎందుకు భయపడుతున్నారు?’’ అని ప్రశ్నించారు.
Gold Rate Today: షాకిచ్చిన బంగారం ధరలు.. గోల్డ్ రేట్స్ తగ్గాయన్న సంతోషం రెండు రోజులే!
