ఇటీవల మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ గా మారుతున్నారు. కొన్ని రోజుల క్రితం తమ బంధువుల అబ్బాయికి ఉద్యోగం కావాలని మంత్రి శ్రీధర్ బాబును కోరడం ఆ వ్యాఖ్యలు కాస్త వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు మంత్రులు కమిషన్ తీసుకుంటారు అనే వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మంత్రుల దగ్గర ఏ పని జరగాలన్నా.. ఏ ఫైల్ కదలాలన్నా డబ్బులు ఇవ్వాల్సిందే అంటూ మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.…
Konda Surekha : బీఆర్‌ఎస్ పార్టీపై మంత్రి కొండా సురేఖ ఘాటు విమర్శలు చేశారు. సిఎస్‌ఆర్ నిధులతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొంటూ, తాను ఎప్పుడూ మంత్రులు కమిషన్ తీసుకుంటారని మాత్రమే వ్యాఖ్యానించానని, కాంగ్రెస్ మంత్రులను ఉద్దేశించి కాదని స్పష్టంచేశారు. అయితే తన మాటలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌కు చెందిన కొంతమంది నేతలు తప్పుడు వీడియో ఎడిటింగ్‌తో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను చెప్పిన మాటల్ని అసంపూర్ణంగా ప్రచారం చేసి…