Bhatti Vikramarka: నేడు క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరగనుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన సెక్రెటిరేటర్ లో ఉదయం 11.30గంటలకు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. రైతు భరోసాపై చర్చించనున్నారు. సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో సబ్ కమిటి నివేదిక కొలిక్కి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read also: Constables Suicide: ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒకే రోజు ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్ల ఆత్మహత్య..
వచ్చే ఏడాది సంక్రాంతికి రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఇప్పటికే పలుమార్లు చెప్పారు. దీంతో రైతు భరోసా పథకానికి నిధుల సమీకరణపై ఆర్థిక శాఖ దృష్టి సారిస్తుంది. అర్హులైన రైతులను గుర్తించేందుకు త్వరలో కొత్త మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు అనర్హులను తొలగించేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే పలు వర్గాలతో చర్చలు జరిపింది. గత ప్రభుత్వం రైతు బంధు పథకం కింద పంటలు పండించని భూ యజమానులకు రూ.21 వేల కోట్లకు పైగా ఇచ్చారనీ, కానీ ఇప్పుడు నిజంగా సాగుచేసే నిజమైన రైతులందరికీ రైతు భరోసా పథకం ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. కొండలు, గుట్టలు, రహదారులకు కూడా పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్నందున వాటిని గుర్తించేందుకు కసరత్తు చేస్తుంది.
Read also: MLC Kavitha: నేడు నిజామాబాద్‌కు ఎమ్మెల్సీ కవిత.. ఇందల్వాయి టోల్ గేట్ వద్ద నుంచి భారీ ర్యాలీ
భూమిలేని పేదలకు ఆర్థిక సాయం, అన్నదాతలకు రైతు భరోసా పథకాల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఒక్క ఎకరం వ్యవసాయ భూమి కూడా లేని, రోజువారీ పనులు చేసుకుంటూ జీవిస్తున్న అత్యంత నిరుపేదలకు ఆర్థిక సహాయం అందించే పథకాన్ని కూడా ప్రారంభించే సర్కార్ యోచిస్తోంది. తెలంగాణలో మొత్తం 1.16 కోట్ల కుటుంబాలు ఉన్నట్లు ఇటీవల ఇంటింటికీ తిరిగి సర్వేలో వెల్లడైంది. వీరిలో 70 లక్షల మంది రైతులు భూమి నమోదు పుస్తకాలు, రెవెన్యూ రికార్డులు కలిగి ఉన్నారు. మిగిలిన 46 లక్షల కుటుంబాలకు భూమి లేదు. వారిలో పేదలను గుర్తించేందుకు జాతీయ ఉపాధి హామీ చట్టం కార్మిక గుర్తింపు కార్డును ప్రాతిపదికగా ఉపయోగించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
Hyderabad Police: న్యూ ఇయర్ ఎఫెక్ట్.. పబ్‌లు, బార్‌లపై పోలీసుల ఫోకస్..