NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy : రైతు భరోసాపై.. పనికి మాలిన వాడు.. పని లేనోడు విమర్శలు చేస్తారు

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy : రైతు భరోసా పై… పనికి మాలిన వాడు… పని లేనోడు విమర్శలు చేస్తారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. RRR లో 12 వేల కోట్ల అవినీతి అని కేటీఆర్ అంటున్నాడని, టెండర్ పిలిచింది 7 వేల కోట్లే అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తెలిపారు. కేటీఆర్..హరీష్ మానసిక పరిస్థితి సరిగలేదని ఆయన సెటైర్‌ వేశారు. అధికారం ఇక రాదని అర్థమైంది వాళ్లకు అని, 7 వేల కోట్లకు టెండర్ పిలిస్తే… 12 వేల కోట్లు అవినీతి అంటే అర్ధం ఉందా..? అని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ వి పిచ్చి మాటలు తప్పితే.. టెండర్ కి కూడా ఇంకా రెండు నెలలు టైం ఉందన్నారు మంత్రి కోమటిరెడ్డి.

Chinmoy Krishna Das: హిందూ సన్యాసి చిన్మోయ్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన బంగ్లాదేశ్ కోర్టు..

మూసీ టెండర్ కాక ముందే లక్షన్నర కోట్లు అన్నాడు… ఇప్పటికీ టెండర్ కాలేదన్నారు. పిచ్చిళ్ళ అడిగే ప్రశ్నలకు సమాధానం ఏం చెప్తామన్నారు. మానసిక పరిస్థితి సరిగా లేదు… వైద్యులకు చూపించుకోండని ఆయన వ్యాఖ్యానించారు. వాళ్ళ తల్లితండ్రులకు కూడా సలహా.. మీ పిల్లల్ని డాక్టర్ కి చూపించండి అంటూ మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్.. అసెంబ్లీకి వచ్చి చేసేది ఏముందని, ప్రతిపక్ష నాయకుడు దమ్ముంటే అసెంబ్లీ కి రా అని ఆయన సవాల్‌ విసిరారు. మీ తప్పులు చర్చ చేద్దాం.. సమాధానం చెప్పు.. కానీ పిల్లల్ని రోడ్డు మీద వదిలేయకు అంటూ మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేశారు.

AP News: తనిఖీ చేస్తుండగా.. కానిస్టేబుళ్ల పైనుంచి దూసుకెళ్లిన కారు!