NTV Telugu Site icon

Komatireddy Rajagopal Reddy: నాకు హోంమంత్రి పదవి అంటే ఇష్టం.. వస్తదనే అనుకుంటున్నా…

Rajgopal Reddy

Rajgopal Reddy

మంత్రి పదవి వస్తదనే అనుకుంటున్నా… కెపాసిటీని బట్టి మంత్రులను ఎంపిక చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తాజాగా చిట్‌చాట్‌లో ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. భువనగిరి ఎంపీ బాధ్యతలు ఇస్తే.. సమర్థవంతంగా నిర్వహించానని గుర్తు చేశారు. తనకు హోంమంత్రి పదవి అంటే ఇష్టమన్నారు. ఏ పదవి వచ్చినా సమర్థవంతంగా నిర్వహిస్తాని తెలిపారు. ప్రజల పక్షాన నిలబడతానని స్పష్టం చేశారు.. నిన్న ఢిల్లీలో సీరియస్ గానే కేబినెట్ పై చర్చ జరిగినట్లు ఉందన్నారు.

READ MORE: MMTS Incident: ఎంఎంటీఎస్‌లో అత్యాచార యత్నం.. మహిళా ప్రయాణికురాలి రియాక్షన్ ఇదే..

తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం దాదాపుగా ఖరారు అయింది. ఉగాది నాటికి విస్తరణ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. గత ఏడాదిన్నరగా విస్తరణకు సంబంధించి అనేక ఊహగానాలు వినిపించినప్పటికీ తాజాగా అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. క్యాబినేట్‌ విస్తరణతో పాటు ఇతర పదవులు… నామినేటెడ్ పోస్టుల నిర్ణయం తీసుకోనున్నారు. నిన్న (సోమవారం) ముఖ్యమంత్రి ఢిల్లీలో పార్టీ ఆగ్రనేత‌ల‌తో భేటీ అయ్యారు. సీఎంతో పాటు డిప్యూటి సీఎం భ‌ట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మ‌హేశ్ కుమార్ గౌడ్‌, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. వీరంతా రాహుల్ గాంధీ, ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే, కేసీ వేణుగోపాల్ తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సమావేశంలో నాలుగు మంత్రి పదవులు ఎవరికి ఇవ్వలని నిర్ణయం తీసుకున్నారో తెలియాల్సి ఉంది.

READ MORE: MLA Madhavi Reddy: కడప మేయర్‌పై ఎమ్మెల్యే మాధవి సంచలన వ్యాఖ్యలు.. చర్యలు తప్పవు..!