మంత్రి పదవి వస్తదనే అనుకుంటున్నా... కెపాసిటీని బట్టి మంత్రులను ఎంపిక చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తాజాగా చిట్‌చాట్‌లో ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. భువనగిరి ఎంపీ బాధ్యతలు ఇస్తే.. సమర్థవంతంగా నిర్వహించానని గుర్తు చేశారు. తనకు హోంమంత్రి పదవి అంటే ఇష్టమన్నారు. ఏ పదవి వచ్చినా సమర్థవంతంగా నిర్వహిస్తాని తెలిపారు. ప్రజల పక్షాన నిలబడతానని స్పష్టం చేశారు..