Kolikapudi Srinivasa Rao: తిరువూరు నియోజకవర్గ అభివృద్దే నా ప్రధాన లక్ష్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు పట్టణంలో 20వ వార్డులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో ప్రతి ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టబోయే సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ.. అందరూ కూడా టీడీపీకి ఓటు వేయాలని ప్రజలను కొలికపూడి కోరారు. 20 వార్డులో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కొలికపూడి శ్రీనివాసరావుకి తమ సమస్యను వార్డు సభ్యులు చెప్పడంతో అధికారంలోకి వచ్చిన వంద రోజులలో మీ సమస్యను తీరుస్తాను అని వార్డు సభ్యులకు హామీ ఇచ్చారు. తిరువూరు నియోజకవర్గ అభివృద్దే నా ప్రధాన లక్ష్యం, మీ అందరూ టీడీపీకి ఓటెయ్యండి, తిరువూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి నేను చూపిస్తాను అని కొలికపూడి శ్రీనివాసరావు వెల్లడించారు.
Read Also: Supreme Court : ఉత్తరాఖండ్ అడవుల్లో అగ్నిప్రమాదం.. సుప్రీంకోర్టులో విచారణకు డిమాండ్
Also Read
ఈ ప్రచార కార్యక్రమంలో మీడియాతో కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు తిరువూరు పట్టణంలోని 20వ వార్డులో యాదవ బజార్లో ప్రచారం చేస్తున్న నాకు యాదవ సామజ వర్గానికి చెందిన కొంతమంది యాదవ సోదరులు, మహిళలు వారి సమస్యను చెప్పుకున్నారన్నారు. యాదవుల సంప్రదాయం ప్రకారం కుల వృత్తిలో భాగంగా పశువుల పెంపకం చేస్తారు.. యాదవులు ఎన్ని ఇబ్బందులు వచ్చిన పశు పోషణ ఆపలేదు, చాలా రైతు కుటుంబాలు పశువులను వదిలేసిన, పశుపోషణ ఆపేసిన యాదవ సోదరులు ఇంకా పశుపోషణ కొనసాగిస్తున్నారు అని ఆయన చెప్పుకొచ్చారు. పట్టణాల్లో చాలా చోట్ల వెటర్నరి హాస్పిటల్స్ యాదవులు నివసించే ప్రాంతానికి దూరంగా ఉన్నాయి.. దీని వల్ల పశువుల పోషణ చేస్తున్న యాదవ సామాజిక వర్గం పశువులకు ఏదైనా సమస్య వస్తే వాటిని హాస్పిటల్ కి తీసుకెళ్ళటానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. ఒకొక్కసారి పశువులు కూడా మృతి చెందుతున్నాయని కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు.
Read Also: Ruhani Sharma: చూపులతో మాయ చేస్తున్న రుహాణి శర్మ…
యాదవులు వెటర్నరి హాస్పిటల్స్ వారు నివసించే ప్రాంతానికి దగ్గర ఉండాలని కోరుకుంటున్నారని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి, అలాగే రేపు రాబోయే టీడీపీ- జనసేన- బీజేపీ ప్రభుత్వ నాయకులకు తెలియజేస్తానన్నారు. ఎక్కడైతే పట్టణాల్లో యాదవులు ఎక్కువగా నివాసిస్తున్నారో.. పశుపోషణ ఎక్కువ జరుగుతుందో అక్కడ వెటర్నరి హాస్పిటల్స్ నిర్మాణం చేపట్టాలని కోరారు. దీని వల్ల యాదవ సామాజిక వర్గాంతో పాటు పశుపోషణ చేసే మిగతా వర్గాలకు కూడా ఉపయోగపడుతుంది అని కొలికపూడి శ్రీనివాసరావు వెల్లడించారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!