Kolikapudi Srinivasa Rao: తిరువూరు పట్టణంలో కొలికపూడి ఎన్నికల ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని 19వ వార్డులో ఎన్డీయే కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటింటికి తిరుగుతూ వార్డు ప్రజలను మీకు ఏ సమస్యలు ఉన్నాయో తెలపండి, మీ సమస్యలు నేను తీరుస్తాను అంటూ హామీ ఇస్తూ.. ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 19 వార్డులోని కొంతమంది ప్రజలు కొలికపూడి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇక, ప్రచార కార్యక్రమంలో కొలికపూడి శ్రీనివాసరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో భాగంగా 19 వార్డులో రజక బజారులో ఇంటింటికి ప్రచారం చేస్తున్నప్పుడు చాలా మంది రజక కుటుంబస్తులు టీడీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు.
Read Also: Maheshwaram: కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమక్షంలో బీజేపీలోకి 8మంది కార్పొరేటర్లు..
Also Read
- Low Cost Smartphones: రూ.9,999కే 5జీ స్మార్ట్ ఫోన్స్.. 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో మార్కెట్లో లాంచ్..
- PM Modi: మోడీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత గౌరవం.. భారతీయులకు అంకితం
- India vs UK Healthcare: ‘భారత్లో ఉండటం అదృష్టం’.. యూకేలో డాక్టర్ కామెంట్స్ వైరల్
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
దాదాపుగా బీసీ కులాల్లో రజకులు నిర్లక్ష్యానికి గురి అవుతున్నారని కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. సాంప్రదాయ వృత్తి చేసుకుంటూ, వేరే అవకాశాలు లేక ఆర్థికంగా కూడా రజకులు వెనకబడిపోయారన్నారు. రాబోయే టీడీపీ- జనసేన- బీజేపీ ప్రభుత్వంలో రజకులకు సంబంధించి రజక కార్పొరేషన్ ద్వారా వారి సాంప్రదాయ వృత్తిని ప్రోత్సహిస్తూనే.. మరో పక్క వాళ్ల కుటుంబాలలో ఉన్న పిల్లలు చదువుకొని ఆధునిక వృత్తుల వైపు వెళ్లే విధంగా ప్రోత్సహిస్తామని ఆయన వెల్లడించారు. వార్డులో ఉన్న ప్రతి ఒక్కరు టిడిపికి ఓటు వేయండి తిరువూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. అలాగే, తిరువూరు పట్టణంలో రజక బజార్లో వీళ్లకు కావాల్సిన ఒక మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాలుతో పాటు వారికి అన్ని సౌకర్యాలతో కూడిన ఒక దోబి ఘాట్ ను రాబోయే రోజుల్లో ఏర్పాటు చేస్తామని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు వెల్లడించారు.
తాజావార్తలు
-
మీకు PM Kisan డబ్బులు రావట్లేదా? ఈ కారణాలే వాటిని ఆపేస్తున్నాయట!
-
Low Cost Smartphones: రూ.9,999కే 5జీ స్మార్ట్ ఫోన్స్.. 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో మార్కెట్లో లాంచ్..
-
PM Modi: మోడీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత గౌరవం.. భారతీయులకు అంకితం
-
India vs UK Healthcare: ‘భారత్లో ఉండటం అదృష్టం’.. యూకేలో డాక్టర్ కామెంట్స్ వైరల్
-
Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!