రాష్ట్రంలో వర్షాలకు 7 లక్షల ఎకరాల లో పంట నష్టపోయిందని, కేసీఆర్ 2 లక్షల ఎకరాల్లో పంట నష్టంకి ఎకరాకు 10 వేలు ఇస్తా అన్నారన్నారు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి. ఇప్పటి వరకు నష్టపరిహారం పైసా సాయం అందలేదని ఆయన విమర్శించారు. పంట పరిహారంపై సీఎస్‌ని కలవడానికి అపాయింట్ మెంట్ అడిగినా ఇవ్వడం లేదని, అధికారులు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకపోతే ఎలా అని కోదండరెడ్డి ప్రశ్నించారు. రైతుల గురించి మాట్లాడతాం అంటే కూడా ఇవ్వరా అని ఆయన మండిపడ్డారు.
Also Read : Black Heads: ముఖంపై నల్లటి మచ్చలున్నాయా.. ఈ వంటింటి చిట్కాలు మీ కోసమే!
వ్యవసాయ, సివిల్ సప్లై.. రెవెన్యూ అధికారులు మధ్య అసలు సమనవ్యయం లేనే లేదని, రైతులకు రుణమాఫీ ఏమైందని ఆయన అన్నారు. ప్రయివేటు అప్పుల మీద కంట్రోల్ లేదని, బీఆర్‌ఎస్ రైతు వ్యతిరేకి అని ఆయన విమర్శించారు. కేంద్రం కూడా రైతులను పట్టించుకోవడం లేదని, 15వ ఫైనాన్స్ నుండి 1600 కోట్లు వచ్చాయి రాష్ట్రానికి అని, డబ్బులు ఏమయ్యాయి అనే అడిగే వారే లేరని ఆయన అన్నారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఎందుకు అడగడం లేదని, ఆ డబ్బులు ఏమయ్యాయి అని కేంద్రం తో అడిగించలేరా ? అని కోదండ రెడ్డి ఫైర్ అయ్యారు. రాజకీయ డ్రామాలు వేయడం తప్పితే సమస్యలు పట్టవా..కేంద్రం కి..? అని ఆయన ధ్వజమెత్తారు.
Also Read : Srivishnu: ‘సామజవరగమన’ అప్ డేట్ లేదేంటి!?