ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చల నుంచి విముక్తి పొందేందుకు యువతులు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వంటింటి చిట్కాలతోనే వాటిని పోగొట్టుకోవచ్చు.
ఆలుగడ్డలను గుజ్జుగా చేసి, అందులో కొంత తేనె కలిపి.. మచ్చలున్న చోట కాసేపు అప్లై చేయాలి. ఆ తర్వాత నీటితో శుభ్రంగా కడుక్కోవాలి.
మజ్జిగలో కొంత టొమాటో రసం కలిపి.. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. పావుగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. వారంలో రెండుసార్లు ఇలా చేస్తే బెటర్.
ఒక గిన్నెలో కొద్దిగా పెరుగు, అందులో కొంచెం నిమ్మరసం కలిపి.. మచ్చలున్న చోట అప్లై చేస్తే, మచ్చలు తొలగిపోయి, మెరిసే సౌందర్యం పొందవచ్చు.
ఓట్స్‌ను గ్రైండ్ చేసి, అందులో నిమ్మరసం కలిపి పేస్టులా చేయాలి. దాన్ని ముఖంపై మర్దనా చేసి, కాసేపయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
అలొవెరా జెల్‌ను మచ్చలున్న చోట పూసి, బాగా మసాజ్ చేయాలి. ఇలా రోజుకు రెండుసార్లు.. చేస్తే కొన్ని వారాల్లోనే మచ్చలు మాయమవుతాయి.
బొప్పాయి గుజ్జులో కొద్దిగా నిమ్మరసం కలిపి.. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. పావుగంట తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి.
కొద్దిగా పసుపు తీసుకొని, అందులో కొంచెం నిమ్మరసం కలిపి.. ముఖానికి పట్టించాలి. 15 నిమిషాల తర్వాత ముఖాన్ని కడిగేసుకుంటే, చర్మం మెరిసిపోతుంది.
ఒక టీ స్పూన్ పాలు, ఒక టీ స్పూన్ తేనె కలిపి.. ముఖానికి అప్లై చేసి, మసాజ్ చేయాలి. దీంతో మచ్చలు తొలగి, కాంతివంతమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.