Kodali Nani: టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్‌కు బహిరంగ సవాల్ విసిరారు మాజీ మంత్రి కొడాలి నాని.. కృష్ణా జిల్లా గుడివాడలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నేతలపై ఫైర్ అయ్యారు.. స్క్రాప్ బ్యాచ్ అంతా రాజమండ్రిలో మహానాడు సభ పెట్టుకున్నారని సెటైర్లు వేసిన ఆయన.. చంద్రబాబు, లోకేష్ కు దమ్ముంటే గుడివాడ, గన్నవరంలో పోటీ చేయాలని సవాల్ చేశారు.. ఎన్టీఆర్ పేరుతో, ప్రజలకు వెన్నుపోటు పొడిచేందుకు చంద్రబాబు సిద్ధమయ్యాడని విమర్శించారు.. ఎన్టీఆర్ ఉంటే పార్టీ, రాష్ట్రం నాశనం అవుతుందన్న చంద్రబాబు.. గతిలేక రాజకీయంగా బతకడానికి తిరిగి ఎన్టీఆర్ పేరు వాడుకుంటున్నాడని మండిపడ్డారు. రాజకీయాలంటే బట్టల వ్యాపారమా? ఆకర్షణీయమైన మేనిఫెస్టో పెట్టడానికి అంటూ సెటైర్లు వేశారు.. చంద్రబాబు కుక్క బతుక్కి 2024 ఎన్నికల్లో చెప్పు దెబ్బ తప్పదంటూ హెచ్చరించారు. చంద్రబాబు ఆకర్షణీయమైన అబద్ధాలు, వెన్నుపోట్లు ప్రజలందరికీ తెలుసన్న ఆయన.. చంద్రబాబు, లోకేష్ ను తన్ని తరిమి కొట్టి ఎన్టీఆర్ వారసులు తెలుగుదేశం పార్టీని స్వాధీనం చేసుకుంటారని జోస్యం చెప్పారు.. దేశమంతా తిరిగిన చంద్రబాబు లాంటి నీచ రాజకీయ నాయకుడు మరొకరు ఉండరంటూ మండిపడ్డారు మాజీ మంత్రి కొడాలి నాని.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్