NTV Telugu Site icon

Kodali Nani: దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు..

Kodali Nani

Kodali Nani

Kodali Nani: తిరుమల ప్రతిష్ట మంట గలిసేలా ఆలయాన్ని రాజకీయాల్లోకి ముఖ్యమంత్రి చంద్రబాబు లాగారని మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబును దేవుడు క్షమించడన్నారు. చంద్రబాబు హయాంలో కూడా నాణ్యత లేని నెయ్యి ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయని.. మా హయాంలో కూడా నాణ్యత లేని నెయ్యి ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయని తెలిపారు. సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలో తాజాగా నెయ్యి ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయని.. ఈ నెయ్యిని కూడా వాడలేదన్నారు. గతంలో కొన్ని వందలసార్లు ఇలానే నెయ్యిని వెనక్కి పంపటం జరిగిందన్నారు. వైసీపీ హయాంలో నెయ్యి క్వాలిటీ లేదని 18 సార్లు ట్యాంకర్ల వెనక్కి పంపడం జరిగిందన్నారు. రాజకీయాల కోసం చంద్రబాబు ఇదంతా చేస్తున్నారన్నారు.

Read Also: Perni Nani: తిరుమల లడ్డూ ప్రసాదాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు..

జగన్‌ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు తిరుమలను రాజకీయాల్లోకి తీసుకు వచ్చారన్నారు. చంద్రబాబుకి బుద్ధి రావాలని, ప్రసాదంలో ఏ తప్పు జరుగలేదని భక్తులకు తెలియాలన్నారు. ఇప్పటి వరకు అలాంటివి జరగలేదన్నారు. దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసేందుకు దిగజారారని విమర్శలు గుప్పించారు. రాజకీయాల కోసం స్వామిని చంద్రబాబు రోడ్డుకు ఈడ్చారని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎన్నిసార్లు గుండు చేయించుకున్నారని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. వేంకటేశ్వర స్వామిని మతాలతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. జగన్‌ను ఎదుర్కోవాలంటే చంద్రబాబు డైరెక్ట్‌గా రావాలన్నారు. చంద్రబాబు, లోకేష్ సిట్ అంటే సిట్ అనే పోలీస్ ఆఫీసర్‌తో సిట్ ఏర్పాటు చేశారని ఎద్దేవా చేశారు. మతాలను, కులాలను విచ్ఛిన్నం చేసే పెద్ద కుట్రగా తాము భావిస్తున్నామని.. దీనిపై ఎలాంటి ఎంక్వైరీకైనా సిద్ధంగా ఉన్నామని జగన్ ప్రధానికి, సుప్రీంకు లేఖలు రాశారన్నారు.