Ind vs Aus KL Rahul: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా లంచ్ సమయానికి 25 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో, లంచ్‌కు కొంత సమయం ముందు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కనిపించింది. ప్రస్తుతం కేఎల్ రాహుల్ అవుట్ అయినా తీరు ప్రపంచవ్యాప్తంగా చర్చలకు దారితీస్తోంది. మొదట ఫీల్డ్ అంపైర్ కేఎల్ రాహుల్‌కి నాటౌట్ ఇచ్చాడు. కానీ సమీక్ష తర్వాత, అతను ఔట్ అయ్యాడు. దీంతో రాహుల్ సహా వ్యాఖ్యాతలు కూడా నిరాశకు గురయ్యారు.
Read Also: Gold Rate Today: వరుసగా ఐదవ రోజు షాకిచ్చిన బంగారం ధర.. నేడు రూ.870 పెరిగింది!
ఈ నేపథ్యంలో ఇది కేఎల్ రాహుల్‌కు అన్యాయం… అతను బాగా ఆడాడు అంటూ వ్యాఖ్యాత కూడా ఆశ్చర్యపోయారు. మంచి సెట్ అయినా బాట్స్మెన్ ను ఇలా చేయడం సబబు కాదని అన్నారు. అతని బ్యాట్ ప్యాడ్‌కు తగలడంతో స్పైక్ వచ్చిందని, ఈ నిర్ణయం పట్ల నేను అసంతృప్తిగా ఉన్నానని వ్యాఖ్యాత అన్నారు. అంపైర్ చాలా తేలిగ్గా నిర్ణయం తీసుకున్నాడని ఆయన అన్నారు. ఇక మరోవైపు పాకిస్థాన్ మాజీ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్, వ్యాఖ్యాత వసీం అక్రమ్ మాట్లాడుతూ.. థర్డ్ అంపైర్ ఏదో నిరణ్యాన్ని ప్రకటించడాన్ని, అతని ప్యాడ్ ను బ్యాట్ తాకినా సమయంలో, బ్యాట్ కు పక్కకు బాల్ వెళ్లిందని.. కేఎల్ రాహుల్ దురదృష్టకరం అని అన్నాడు. ఆ సమయంలో రెండో యాంగిల్‌లో బ్యాట్ ప్యాడ్‌కి తగిలిందని చాలా స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also: Collide Two Boats: నావికాదళ నౌకను ఢీకొన్న ఫిషింగ్ బోట్.. ఇద్దరు గల్లంతు..11 మంది సిబ్బంది సేఫ్
Matthew Hayden explaining the KL Rahul bat-pad scenario.
– Unlucky, KL. 💔 pic.twitter.com/lf0UOWwmy8
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 22, 2024