Collide Two Boats: నావికాదళ నౌకను ఢీకొన్న ఫిషింగ్ బోట్.. ఇద్దరు గల్లంతు..11 మంది సిబ్బంది సేఫ్
- నావికాదళ నౌకను ఢీకొన్న ఫిషింగ్ బోట్..
- గోవాలో భారత ఫిషింగ్ బోట్ 'మార్తోమా', భారత నౌకాదళ నౌకలు ఢీ
- ఇద్దరు గల్లంతు..11 మంది సిబ్బంది సేఫ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Collide Two Boats: గోవాలో భారత ఫిషింగ్ బోట్ ‘మార్తోమా’, భారత నౌకాదళ నౌకలు ఢీకొన్నాయి. 21 నవంబర్ 2024 సాయంత్రం గోవాకు వాయువ్యంగా 70 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది. పడవలో 13 మంది సభ్యులు ఉండగా, అందులో 11 మంది సురక్షితంగా బయటపడ్డారు. మరోవైపు మిగిలిన ఇద్దరు సభ్యుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం తర్వాత, భారత నావికాదళం వెంటనే పెద్ద ఎత్తున సెర్చ్ అండ్ రెస్క్యూ (SAR) ఆపరేషన్‌ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్ కోసం భారత నావికాదళం ఆరు నౌకలు, విమానాలను మోహరించింది.
Also Read: East Godavari: కేంద్రం గ్రీన్ సిగ్నల్.. తీరనున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజల కష్టాలు
Also Read
- Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
దీనితో పాటు, ముంబైకి చెందిన మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ (MRCC) సహకారంతో రెస్క్యూ ఆపరేషన్‌ను ముమ్మరం చేస్తున్నారు అధికారులు. ఇండియన్ నేవీ వెంటనే సమీపంలోని ఓడలు, విమానాలను అక్కడికి పంపింది. తద్వారా ప్రాణాలతో బయటపడిన వారిని వీలైనంత త్వరగా ఒడ్డుకు చేర్చారు. నౌకాదళ నౌకలు, విమానాలు కాకుండా.. ఇతర వనరులు కూడా రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. గోవా, ముంబై తీర ప్రాంతాల్లో ఉన్న ఏజెన్సీలు కూడా పూర్తి సంసిద్ధతతో ఈ పనిలో నిమగ్నమై ఉన్నాయి. అయితే, ఈ ఘర్షణ ఎలా జరిగిందన్న విషయం ఇంకా తెలియరాలేదు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణ చేపడతామని, అయితే ప్రస్తుతం గల్లంతైన మత్స్యకారుల ఆచూకీకే ప్రాధాన్యతనిస్తున్నారు నేవీ అధికారులు. ఈ ఘటన సముద్ర భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది. రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన తాజా సమాచారం త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. గల్లంతైన సభ్యులను సురక్షితంగా రక్షించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని నేవీ అధికారులు తెలిపారు.
Also Read: Vijay : హాలీవుడ్ స్ఫూర్తితో.. రూ.80కోట్ల బడ్జెట్ తో విజయ్ `నీలంకరై`
తాజావార్తలు
-
Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
-
Cheque Power : పంచాయతీల్లో చెక్ పవర్‌పై కీలక నిర్ణయం… 7 రోజులు దాటితే యాక్షన్
-
Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?