KKR vs DC: ఐపీఎల్‌లో నేడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచిన డీసీ బౌలింగ్ ఎంచుకుంది. ఇక మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) అద్భుతంగా రాణించి ఢిల్లీ క్యాపిటల్స్ (DC)పై భారీ స్కోర్ నమోదు చేసింది. కేకేఆర్‌కి రాహ్మానుల్లా గుర్బాజ్ 12 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 26 పరుగులతో విరుచుకపడ్డాడు. మరో ఓపెనర్ సునీల్ నరైన్ 16 బంతుల్లో 27 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ అజింక్య రహానే 14 బంతుల్లో 26 పరుగులతో ఆడి స్కోరు బోర్డును వేగంగా ముందుకు నడిపించాడు.
ఇక ఆ తర్వాత వచ్చిన యువ ఆటగాడు అంకృష్ణ రఘువంశీ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 32 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 44 పరుగులు బాదాడు. ఇక మిడిల్ ఆర్డర్ బాట్స్మెన్స్ వెంకటేశ్ అయ్యర్ (7), రింకూ సింగ్ (36) రాణించడంతో స్కోరు వేగం పెరిగింది. అండ్రే రస్సెల్ 9 బంతుల్లో 17 పరుగులు చేయగా.. 20 ఓవర్లలో కేకేఆర్ మొత్తంగా 9 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది.
ఇక ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసాడు. అతనికి తోడుగా విప్రజ్ నిగమ్, అక్సర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీసుకోగా.. దుష్మంత చమీరా ఒక వికెట్ తీసాడు. ఇక ఢిల్లీకి విజయానికి 205 పరుగుల భారీ టార్గెట్ ఛేజింగ్ చేసి ప్లేఆఫ్స్ నిలుస్తుందో లేదో.