ఐపీఎల్ 2025 క్వాలిఫైయర్ 1లో పంజాబ్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఈ మ్యాచ్ ముల్లాన్‌పుర్‌లో రాత్రి 7.30కు ఆరంభం కానుంది. ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌కు చేరడం ఇది పదోసారి. ఇప్పటివరకు బెంగళూరు మూడు ఫైనల్స్‌లో ఆడింది కానీ.. ట్రోఫీని మాత్రం అందుకోలేకపోయింది. 2016లో చివరిసారిగా ఫైనల్‌కు చేరిన ఆర్‌సీబీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో 8 పరుగుల తేడాతో ఓడిపోయింది. దాంతో ఈసారి టైటిల్ లక్ష్యంగా ముందుకు దూసుకెళుతోంది. క్వాలిఫైయర్ 1లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న…
ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు పంజాబ్, బెంగళూరు జట్లు క్వాలిఫయర్ 1లో తలపడతాయి. పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న గుజరాత్, ముంబై టీమ్స్ ఎలిమినేటర్‌లో ఢీకొంటాయి. క్వాలిఫయర్ 1లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ ఫైనల్‌కు చేరుతుంది. అయితే ఓడిన జట్టుకు క్వాలిఫయర్ 2 రూపంలో (ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో మ్యాచ్)…
ఐపీఎల్ 2025లో ప్లేఆఫ్స్‌కు వేళైంది. నేడు ముల్లాన్‌పుర్ (చండీగఢ్)లో తొలి క్వాలిఫయర్ జరగనుంది. లీగ్ దశలో పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచిన పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు క్వాలిఫయర్ 1లో తలపడనున్నాయి. క్వాలిఫయర్ 1లో విజేతగా నిలిచిన టీమ్ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు మాత్రం ఫైనల్లో చోటు కోసం ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్ 2లో తలపడాల్సి ఉంటుంది. బెంగళూరు, పంజాబ్ జట్లు మంచి ఫామ్‌లో ఉన్న నేపథ్యంలో హోరీహోరీ…
ఐపీఎల్ 2025లో లీగ్ దశ పూర్తయింది. చివరి లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించింది. ముందుగా లక్నో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ రిషభ్ పంత్ (118 నాటౌట్; 61 బంతుల్లో 11×4, 8×6) సెంచరీ చేశాడు. లక్ష్యాన్ని ఆర్సీబీ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జితేశ్ శర్మ (85 నాటౌట్; 33 బంతుల్లో…
పదేళ్ల తర్వాత ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన పంజాబ్ కింగ్స్.. నేరుగా క్వాలిఫయర్ ఆడే అవకాశాన్నీ ఒడిసిపట్టింది. రెండో దశలో వరుస విజయాలతో దూసుకెళుతున్న ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించిన పంజాబ్.. 19 పాయింట్లతో పట్టికలో అగ్ర స్థానానికి దూసుకెళ్లింది. క్వాలిఫయర్-1లో ఓడిన జట్టుకు ఫైనల్ చేరడానికి క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇప్పుడు పంజాబ్‌కు ఫైనల్ చేరేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయనే చెప్పాలి. పంజాబ్‌పై ఓడిన ముంబై 16 పాయింట్లతో నాలుగో స్థానానికి…
ఐపీఎల్ 2024 క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్.. ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ దిగిన ఓపెనర్లు పెద్దగా పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి క్రీజులోకి వచ్చి జట్టు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన క్వాలిఫైయర్-1 మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో కేకేఆర్ ఫైనల్ కు దూసుకెళ్లింది. 160 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా.. 13.4 ఓవర్లలో 164 పరుగులు చేసింది. కోల్కతా బ్యాటింగ్ లో శ్రేయాస్ అయ్యర్ (58*) వెంకటేష్ అయ్యర్ (51*) పరుగులతో చెలరేగారు. అంతకుముందు ఓపెనర్లు రహ్మతుల్లా గుర్బాజ్ (23), సునీల్ నరైన్ (21) పరుగులతో రాణించారు. హైదరాబాద్ బౌలర్లు పరుగులు…
ఐపీఎల్ 2024లో భాగంగా.. కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు తడబడ్డారు. 19.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయ్యారు. కేకేఆర్ ముందు 160 పరుగుల ఫైటింగ్ స్కోరును ఉంచారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ జరుగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎంచుకుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్ ఇప్పుడు ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించింది. గ్రూప్ దశ మ్యాచ్‌లన్నీ ముగిశాయి. ఇప్పుడు ప్లేఆఫ్‌లోని తొలి మ్యాచ్ అంటే క్వాలిఫయర్-1 మంగళవారం (మే 21) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది.