కేటీఆర్ అభినవ గోబెల్స్ లాగా అయ్యారని కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నన్ను బీఆర్ఎస్ లోకి రమ్మని ఇబ్బంది పెట్టారని, నా ఫోన్ ట్యాపింగ్ అయిందని కంప్లైంట్ ఇవ్వగానే కేటీఆర్ కి పూనకం వచ్చిందన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం నేను ఫిర్యాదు ఇస్తే పరువునష్టం ఎలా అవుతుంది? అని ఆయన ప్రశ్నించారు. ఇంకా అధికారంలోనే ఉన్నానని కేటీఆర్ అనుకుంటున్నారని, కేటీఆర్ ఇచ్చిన నోటీస్ చట్టానికి విరుద్ధంగా ఉందన్నారు.…
రాజన్న సిరిసిల్ల మున్సిపల్ లో 7 విలీన గ్రామాలపై సిరిసిల్ల పట్టణ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు సిరిసిల్ల నియోజకవర్గం ఇంఛార్జి కేకే మహేందర్ రెడ్డి. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నిన్న మున్సిపల్‌లో విలీన గ్రామాలపై మతి భ్రమించి తీర్మానం చేశారన్నారు. ప్రభుత్వం ఏర్పడి నెల కాకముందే రెండు పతకాలు అమలు చేశామన్నారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 7 విలీన…