తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక రాజకీయ వేడిని రాజేసింది. అధికార టీఆర్ఎస్-బీజేపీ పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు, మాటల దాడి చేస్తున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మునుగోడు ప్రచారంలో పాల్గొంటున్నారు. మునుగోడులో బీజేపీ విజయావకాశాలు, బీజేపీ వ్యూహం గురించి ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ లో అనేక విషయాలు వెల్లడించారు. బీజేపీ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణలో బీజేపీ బలపడడానికి ఇది దోహదం చేస్తుందని కిషన్ రెడ్డి చెప్పారు.
దేశ రాజకీయాలకు కుటుంబ రాజకీయాలు చేటు తెస్తాయి. తెలంగాణలో విద్యార్ధులు, మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. కుటుంబ పాలన కాదు ప్రజాపాలన రావాలి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాలి. కావాలని బీజేపీ రాజీనామా చేయించి ఉప ఎన్నిక తెచ్చిందనే విమర్శలపై స్పందించారు. బీజేపీలో చేరాలంటే రాజీనామా చేయాలని కోరాం. టీఆర్ఎస్ లా రాజీనామా చేయించకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని చేర్చుకోవడం అనైతికం కాదా? 18వేల కోట్ల కాంట్రాక్ట్ అనేది పనికిమాలిన ఆరోపణ అని కొట్టిపారేశారు కిషన్ రెడ్డి.
మునుగోడులో పోటీ నుంచి తప్పుకుంటాం అనేవి టేం వేస్ట్ మాటలు. రాజగోపాల్ రెడ్డి నైతిక విలువలకు, టీఆర్ఎస్ ప్రభుత్వ అహంకారానికి మధ్య జరుగుతున్న పోరాటం ఇది. అధికారంలో లేకపోయినా మేం పోటీలో వున్నాం. మీకు మీమీద నమ్మకం వుంటే.. ఇంత మందిని మోహరించాల్సిన అవసరం లేదు. మీరు అభివృద్ధి చేయలేదంటున్నారు. మీరు చేసి వుంటే మీకు నమ్మకం వుండాలి. టీఆర్ఎస్ వితండవాదం, తొండి ఆట, తాను పట్టిన కుందేళ్ళకు మూడే కాళ్ళు అనే వాటికి సమాధానం చెప్పలేం. అబద్ధాలు ఆడడంలో వారు మాస్టర్స్, 100 కోట్లు నీతిఆయోగ్ ద్వారా ఫ్లోరైడ్ నివారణకు రాష్ట్రానికి ఇచ్చాం. రూ.800 కోట్లు 1000 గ్రామాల కోసం కేంద్రం ఇచ్చింది. కేంద్రం ఇవ్వలేదని నిరూపించగలరా? అని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు.
Read Also: Kajal Aggarwal: సమంత లానే కాజల్.. ఆ పార్ట్ కు సర్జరీ..?
పార్లమెంటులో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చామన్నారు. మెడికల్ కాలేజీకి దరఖాస్తు పెట్టుకోవాలి. ఏదీ చూపించకుండా ఎలా కాలేజ్ ఇస్తాం. మునుగోడు ఎన్నిక తర్వాత ప్రభుత్వం కూల్చాల్చిన అవసరం లేదు. ప్రభుత్వం పడిపోవాలనే ఆలోచన లేదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వాన్ని డిస్ట్రబ్ చేయం. కేటీఆర్ మాటల మీద ప్రశ్నలు వేస్తే ఎట్లా. ఆయన చేసినవి అబద్దాలు. సోషల్ మీడియాలో ఆయన యుద్ధం చేస్తారు. చేనేతల ఓట్లు మాకే వస్తాయి. కేంద్రం చేనేత కార్మికుల మీద జీఎస్టీ వేయలేదు. కేవలం సోషల్ మీడియా ద్వారా ఉద్యమం చేస్తున్నారు. అది స్వంత ఉద్యమం. స్వంత ఎజెండా. కేసీఆర్ కిచెన్ లో తయారవుతున్న కిచిడీ ఉద్యమం ఇది. మునుగోడులో అభివృద్ది చేస్తాం. కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనే విమర్శలు అర్థరహితం. వివక్ష లేదు. నలుగురు ఎంపీలు వున్నారు. తెలంగాణ మీద మాకు ఎలాంటి వివక్ష లేదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
బీజేపీలోకి వస్తానంటే మేం రావద్దంటామా? తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం నియంతృత్వ ధోరణి పోవాలంటే బీజేపీ బలపడాలి. స్వామిగౌడ్ కేసీఆర్ ని ఎందుకు విమర్శించారో.. ఇప్పుడు బీజేపీ నుంచి ఎందుకు టీఆర్ఎస్ లోకి వెళ్లారో వారినేఅ అడగాలి. ఎందుకోసం పోయారో విశ్లేషించుకోవాలి. వేరే పార్టీ నుంచి మా పార్టీలోకి రావచ్చు. మునుగోడులో బీజేపీకి టీఆర్ఎస్ కి మధ్య పోటీ వుంటుంది. టీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్ ని చంపడానికి ప్రయత్నిస్తోందన్న రేవంత్ వ్యాఖ్యలపై వ్యంగ్యంగా స్పందించారు. కాంగ్రెస్ ని చంపుతున్నది రాహుల్ గాంధీ. మాకా అవసరంలేదు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు మంచి స్పందన రావడం మేం స్వాగతిస్తాం. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీలో చేరతారా? లేదా అనేది ఆయన్నే అడగాలన్నారు కిషన్ రెడ్డి.
రాబోయే రోజుల్లో పవన్ తో కలిసి పనిచేసే అంశం చర్చకు రాలేదు. పవన్ ని కలవడం తప్పుకాదు. ఈడీ, ఐటీ. సీబీఐ కొత్తగా రాలేదు. ఎక్కడ దాడులు చేస్తారో మాకు తెలీదు. ప్రజలకు, మీడియాకు మేం సమాధానం చెబుతాం. రాజకీయంగా మేం ఎవరిమీద దాడులు చేయడం లేదు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలా మాట్లాడుతున్నారు. రాజకీయనేతలు నిద్రలో ఈడీ…ఈడీ… సీబీఐ..సీబీఐ అంటున్నారు. మేం తప్పుడు ఆరోపణలతో మేం దాడులు చేస్తే తెలియచేయండి. మేం ఎవరిమీద దాడులు చేయమని చెప్పం. ఈసీ నిబంధనలు వుంటాయి. ఎన్నికల గుర్తులు విషయంలో మేం జోక్యం చేసుకోం. గుర్తులు, బిర్యానీ, మద్యం పంపిణీ ద్వారా మేం గెలవాలని అనుకోవడం లేదు. ఎలాగూ టీఆర్ఎస్ ఓడిపోతుందన్నారు కిషన్ రెడ్డి.