కృతి శెట్టి..ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉప్పెన సినిమాతో తెలుగులో భారీ విజయం అందుకుంది ఈ భామ.ఆ సినిమా భారీ సక్సెస్ కావడంతో ఎంతగానో పాపులర్ అయింది కృతి శెట్టి.ఆ పాపులరిటి తో ఈమె టాలీవుడ్ లో అవకాశాలు సాధించింది.కృతి శెట్టి ఉప్పెన సినిమా తర్వాత బంగార్రాజు అలాగే శ్యామ్ సింగ రాయ్ సినిమాలను చేసింది.. ఈ రెండు సినిమాలు కూడా విజయం సాధించడం తో హ్యాట్రిక్ హిట్ హీరోయిన్ గా పేరు పొందింది.కానీ ఈ మూడు సినిమాల తర్వాత మంచి కథలను ఎంచుకోవడం లో కొంత ఇబ్బంది పడింది.
అందుకే వరుస ప్లాప్స్ అందుకుంది. ప్రస్తుతం కృతి శెట్టి కెరీర్ రిస్క్ లో పడింది.. వరస పరాజయాలు ఆమె కెరీర్ కి ఇబ్బందిగా మారాయి.ప్రస్తుతం కృతి కెరీర్ కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. తమిళ్ సూపర్ స్టార్ హీరో సూర్య తో నటిస్తున్న సినిమా మధ్యలోనే ఆగిపోయింది. దాంతో కృతి శెట్టి పూర్తి నిరాశలో ఉందని తెలుస్తుంది. ఎలాగైనా ఆఫర్స్ సాధించేందుకు వరస ఫోటో షూట్స్ ను ప్లాన్ చేసింది. దాదాపు ఆరు వారాల్లోనే పద్నాలుగు ఫోటో షూట్స్ చేసింది.. దాంతో ఆమె చేతిలో ఇప్పుడు ఒక కొత్త సినిమా వచ్చి చేరింది. ఈ చిత్రం కంటే ముందుగా మలయాళంలో టోవినో థామస్ పక్కన హీరోయిన్ గా ఒక చిత్రంలో నటిస్తుంది. ఆ తర్వాత జయం రవి సరసన జీని సినిమా లో కూడా హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తుండగా అందులో ఒక హీరోయిన్ గా కృతి ఎంపిక అయ్యింది. వరుస ఫోటో షూట్స్ తో కొత్త సినిమాలను లైన్ లో పెడుతుంది.ఆఫర్స్ కోసం కృతి శెట్టి సరికొత్త స్ట్రాటజీ అప్లై చేస్తుంది. ఇలా పొందిన ఆఫర్స్ తో అయినా కృతి శెట్టి భారీ విజయం అందుకుంటుందో లేదో చూడాలి