బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ గత పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉండలేకపోతుందని ఆరోపించారు.
మేము మా కుటుంబం మాత్రమే దేశాన్ని పరిపాలించాలి అనే దుర్మార్గపు ఆలోచనతో సోనియా గాంధీ ఉందని పేర్కొన్నారు. మరోవైపు.. రాహుల్ గాంధీ జోడో యాత్రను ప్రజలు పట్టించుకోలేదని అన్నారు. రాహుల్ గాంధీ చేసింది భారత్ జోడో యాత్ర కాదు తోడో యాత్ర అని విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ యాత్ర చేసిన దగ్గర కాంగ్రెస్ నాయకులు పార్టీని వదిలి వెళ్తున్నారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ పాలనకు, బీజేపీకి నక్కకు నాగ లోకానికి ఉన్న తేడా కనిపిస్తుందని కిషన్ రెడ్డి ఆరోపించారు.
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రన్ వే పై కొనసాగుతున్న ఆపరేషన్ చిరుత..
మోడీ పాలన ఎటువంటి విమర్శలు చేయడానికి కారణం లేకుండా ఉందని పేర్కొ్న్నారు. బీజేపీ ఎజెండా ఎంటో మేము చెప్పాలి కానీ కాంగ్రెస్ వాళ్లు చెబుతున్నారన్నారు. రిజర్వేషన్స్ ను రద్దు చేస్తున్నామని కాంగ్రెస్ అబద్దపు ప్రచారం చేస్తుందని.. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేశారు.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనడానికి ఒక్క సాక్షం చూపించు రేవంత్ రెడ్డి అని అన్నారు. కాంగ్రెస్ ప్రచారం చేస్తున్న రిజర్వేషన్స్ రద్దు అనేది ఈ దశాబ్దంలోనే పెద్ద అబద్ధం అని కిషన్ రెడ్డి చెప్పారు.
Andhra Pradesh: తనిఖీల్లో.. 14 కోట్ల విలువైన 66 కేజీల బంగారం పట్టివేత
తెలంగాణలో బీసీ రిజర్వేషన్స్ కు రాష్ట్ర ప్రభుత్వం గండి కొడుతుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా ప్రకటిస్తే.. అడ్డుకోవడానికి ప్రయత్నించారన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ప్రధాని చేసిన ఘనత బీజేపీదని తెలిపారు. రాహుల్ గాంధీ ఆశలు నిరాశలు అయ్యాయి.. కాంగ్రెస్ కాళ్ల కింద భూమి కదులుతుందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు అనేక కల్పితాలు సృష్టించి.. కళ్లబొల్లి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. బీసీ కమిషన్ కు రాజ్యాంగబద్దమైన అధికారాలు కల్పించి.. బీసీలకు గౌరవం పెంచామని కిషన్ రెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డి దమ్ముంటే ఇచ్చిన హామీలు నెరవేర్చు.. లేకపోతే దిగిపో అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
