తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో విజయ సంకల్ప యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ పదేళ్లుగా మోసం చేసిందని ఫైర్ అయ్యారు. తెలంగాణకు ఇక బీఆర్ఎస్ పార్టీ అవసరం లేదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కుటుంబ పార్టీలేనని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మాదిరిగా చీకటి రాజకీయాలు మేం చేయమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదని కిషన్ రెడ్డి మరోసారి తేల్చి చెప్పారు. మెడ మీద తలకాయ లేని వాడు బీఆర్ఎస్, బీజేపీ పొత్తు అని మాట్లాడుతారని.. మూర్ఖుడు, దుర్మార్గుడు చేస్తున్న ప్రచారాలను తాము ఖాతరు చేయమన్నారు. కాగా, పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయని గత కొన్ని రోజులుగా ప్రచారం చేస్తున్నారన్నారు. పొత్తు వార్తలపై ఇంతకుముందు క్లారిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి.. ఇవాళ మరోసారి బీఆర్ఎస్‌తో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదని మరోసారి క్లారిటీ ఇచ్చారు.
Read Also: Akhilesh Yadav: అఖిలేష్ మళ్లీ షాక్.. మరో 11 మంది అభ్యర్థుల ప్రకటన
ఇదిలా ఉంటే.. బీజేపీ సంకల్ప యాత్రలను షెడ్యూల్ రాకముందే పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ప్రచార మాధ్యమాలు ద్వారా వస్తున్న సమాచారం మేరకు మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని అన్నారు. బీజేపీ 370 సీట్లు, NDA 400 సీట్లు గెల్చుకోవాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. కాగా.. ఇండియా కూటమిపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. కూటమి టెంట్స్ కోలిపోతున్నాయి.. అందుకే నమ్మకం లేక ఆ కూటమి నుండి బయటకు వస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ పార్లమెంటు ఎన్నికల తరవాత విదేశాలకు వెళ్లిపోతారని అన్నారు. మరోవైపు.. యాత్రల సందర్భంగా బీజేపీలో చేరికలు ఉంటాయని చెప్పారు.
Read Also: Pawan Kalyan: పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానంపై క్లారిటీ.. అక్కడి నుంచే..!