తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో విజయ సంకల్ప యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ పదేళ్లుగా మోసం చేసిందని ఫైర్ అయ్యారు. తెలంగాణకు ఇక బీఆర్ఎస్ పార్టీ అవసరం లేదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కుటుంబ పార్టీలేనని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మాదిరిగా చీకటి రాజకీయాలు మేం చేయమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదని కిషన్ రెడ్డి…
ప్రస్తుతం పొత్తులపై బీజేపీ అధిష్ఠానం ఏపీ నాయకత్వంతో మాట్లాడే అవకాశం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. అధిష్ఠానం మళ్లీ పిలిస్తేనే ఏపీ బీజేపీ నేతల బృందం చర్చల కోసం వస్తామని చెప్పారు. ఎప్పుడు చర్చల కోసం పిలుస్తారో తెలియదు.. చెప్పలేమన్నారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ సమావేశాల్లో పురేంధేశ్వరీ పాల్గొన్నారు. దాదాపు ఏపీ నుంచి 270 మందికి పైగా ప్రతినిధులు వచ్చారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం సీపీఐ కార్యవర్గ సమావేశం అయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్‌తో పొత్తుపై భిన్నాభిప్రాయాలు రావడంతో రాష్ట్ర సీపీఐ తుది నిర్ణయాన్ని కేంద్ర కమిటీకి అప్పగిస్తూ కమిటీ తీర్మానం చేసింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కొత్తగూడం సీటు ఇచ్చినా... మునుగోడులో పోటీ చేస్తామని నల్గొండ జిల్లా సీపీఐ నేతలు అంటున్నారు.
పర్చూరులో కౌలు రైతుల భరోసా యాత్ర సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. పవన్ కళ్యాణ్ గెలిపించిన టీడీపీ ప్రభుత్వం రైతులను దగా చేసింది వాస్తవం కాదా?? ఇప్పుడు రైతుల ఇబ్బందులకు అప్పటి ప్రభుత్వం చేసిన మోసం కాదా?? అప్పుడు రైతుల గురించి ఎందుకు ప్రశ్నించలేని నాని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నా… ప్రతిపక్షంలో ఉన్నా వైసీపీని ప్రశ్నించటమే పవన్ కళ్యాణ్ కు తెలుసు. పవన్ కళ్యాణ్ పార్టనర్…
టీడీపీ నేతలపై ఒకరేంజ్‌లో ఫైరయ్యారు మంత్రి గుడివాడ అమర్నాథ్. అయ్యన్న పాత్రుడు మహిళా మంత్రి పై చెప్పిన మాటలు వింటే మహిళలు ఎవరూ టీడీపీకి ఓటు వేయరన్నారు. 151 కోట్ల స్కాం చేసిన అచ్చెన్నాయుడును బొక్కలో వేయకుండా ఏం చేస్తారు? రాష్ట్రంలో ఎవరికీ ఇంగ్లీష్ వద్దంటాడు చంద్రబాబు…తన కొడుకును మాత్రం ఇంగ్లీషులో చదివిస్తాడన్నారు మంత్రి అమర్నాథ్. చంద్రబాబుకు సిగ్గుందా? చంద్రబాబు హయాంలో 38 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే జగన్ ప్రభుత్వం 62 లక్షల మందికి ఇస్తోంది.…
ఏపీలో రాజకీయ వేడి రోజురోజుకీ రాజుకుంటోంది. మంత్రులు, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం వాడివేడిగా సాగుతోంది. అనకాపల్లిలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా ప్రేమికులు దొరుకుతారేమో అని తిరుగుతున్నారు. అందుకే అనకాపల్లి జిల్లాలో ఈ రెండు రోజుల సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు. 74 ఏళ్ల చంద్రబాబునాయుడు నాది వన్ సైడ్ లవ్వు నన్ను ఎవరు ప్రేమించడం లేదని బాధ పడుతున్నాడు. చంద్రబాబు నాయుడు…
ఏపీలో తూర్పుగోదావరి రాజకీయాలు గోదావరి అంత ప్రశాంతంగా వుండవు. తుఫాన్ వచ్చినప్పుడు లంక గ్రామాల్ని ముంచేసినట్టుగా అక్కడ రాజకీయాలు హాట్ హాట్ గా వుంటాయి. తాజాగా జనసేన-వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మంగళగిరిలో జరిగిన జనసేన సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి దాడిశెట్టి రాజా కౌంటరేశారు. అంబేద్కర్ జిల్లా ప్రకటించినందుకు పవన్, చంద్రబాబు అల్లర్లు సృష్టించారన్నారు. మంత్రి, ఎమ్మెల్యే ఇల్లు తగలబెట్టి చంద్రబాబు, పవన్ ఆ మంటల్లో చలికాసుకున్నారు. కోనసీమ అల్లర్లలో…
ఏపీలో ఇప్పుడు వైసీపీ వర్సెస్ జనసేన వ్యవహారం నడుస్తోంది. గతంలో పొత్తుల గురించి మాట్లాడిన పవన్ పై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ నేతల విమర్శలపై అదేరేంజ్‌లో పవన్ ఫైరయ్యారు. మరోసారి వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ పునరుద్ఘాటించారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలితే అది వైసీపీకే లాభం. అందుకే వైసీపీ వ్యతిరేక ఓటు ఒక కూటమికి పడితే అది లాభం అవుతుంది. ఓటు చీలిపోతే వైసీపీ అభ్యర్ధులు గెలుస్తారు. స్వల్ప ఓట్ల తేడాతో…
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఎన్నికలు జరిగే పరిస్థితి లేకపోయినా.. ముందస్తు ఎన్నికలపై ప్రచారం సాగుతోంది.. ప్రతిపక్ష టీడీపీ ముందస్తు ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు అంటుంటే.. అధికార వైసీపీ మాత్రం ముందస్తు ఎన్నికలకు పోయేదేలేదని స్పష్టం చేస్తోంది. ఇక, పొత్తులపై కూడా చర్చ సాగుతోంది.. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో పవన్ కల్యాణ్ పొత్తులపై చర్చకు తెరలేపారు. అయితే, 2024 ఎన్నికల్లో పొత్తులపై క్లారిటీ ఇచ్చారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. Read…