Kishan Reddy : బీజేపీ ప్రపంచంలో అతి పెద్ద రాజకీయ పార్టీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కూకట్ పల్లి భారతీయ జనతా పార్టీ బహిరంగ సభ నిర్వహించారు. కూకట్ పల్లి లో జరిగిన బీజేపీ భారీ బహిరగసభలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రేమ్ కుమార్ తో పాటు పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కూకట్ పల్లి అంటే అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించే గడ్డ అని ఆయన అన్నారు. బీజేపీ ప్రపంచంలో అతి పెద్ద రాజకీయ పార్టీ అని, కూకట్ పల్లి ప్రాంతంలో బీజేపీ పటిష్టమైన శక్తిగా ఉందన్నారు. బీజేపీ పాలనలో దేశ ద్రోహుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని, నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత ప్రభుత్వము ఏవిధంగా పని చేస్తుందో ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఏవిధమైన దోపిడీ జరిగిందో గమనించాలని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీది అవినీతి రహితమైన పాలన అని, గతంలో రిమోట్ ప్రధాన మంత్రి ఉండేవారని ఆయన అన్నారు.
Also Read : Onion: కిలో ఉల్లి రూ.25కే.. రేపట్నుంచే విక్రయం
Also Read
- Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
- Kalabhairava : కావ్య కల్యాణ్‌రామ్‌తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
తొమ్మిది ఏళ్లుగా సెలవు తీసుకోకుండా ప్రపంచంలో పని చేసిన ఏకైక ప్రధాని మోడీ అని ఆయన కొనియాడారు. పాకిస్తాన్, ఐఎస్‌ఐఎస్ యాక్టివిటీస్ ఎక్కడో అక్కడ జరిగేవి బీజేపీ ప్రభుత్వం వచ్చాక 9 సంవత్సరాలుగా సమర్థవంతగా పని చేసిన ప్రధాని మోడీ అని ఆయన అన్నారు. మన సైనికులు నిద్ర పోతుంటే పాకిస్తాన్ వాళ్ళు హతమార్చారని, మోడీ ఊరుకోలేదు వారిని ఏరి పారేశారన్నారు. ఉక్రెయిన్ లో విద్యార్థులను రష్యా తో మాట్లాడి యుద్ధం అపి తీసుకొచ్చారని, కరోనా సమయంలో కోట్లాది రూపాయల ఖర్చు పెట్టి ఉచిత వ్యాక్సిన్ ఇచ్చి, నెలకు 5కేజీల ఉచిత బియ్యం ఇచ్చిన చరిత్ర ప్రధాని మోడీది అని ఆయన అన్నారు. జాతీయ రహదారులు, రైల్వే అభివృద్ధి చేస్తున్నామని, కూకట్ పల్లి నుండి బాంబే రోడ్డుతో పాటు దేశంలో జాతీయ రహదారులు అత్యంత అద్భుతంగా వేశారన్నారు. కేసీఆర్ ప్రధాన మంత్రి అవుతా అని ఫామ్ హౌస్ లో ఉండి కలలు కంటున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. అత్యంత అవినీతి కుటుంబం కేసీఅర్ కుటుంబమని, తెలంగాణ తెచ్చుకున్నది బానిసలు గా ఉండటానికి కాదని, ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు, రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ గా మార్చారు కేసీఆర్.. కేటీఆర్ మార్కెటింగ్ చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, ఆరోగ్యశ్రీ అటకెక్కించారు. బీఅర్ఎస్ 30శాతం వాట ఇవ్వకుండా పని చేయడం లేదు అని కిషన్ రెడ్డి ఆరోపించారు.
Also Read : Arvind Kejriwal: మామ మోసం చేశాడు, ఈ చాచాను నమ్మండి.. కేజ్రీవాల్ హామీల వర్షం
తాజావార్తలు
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
-
Kalabhairava : కావ్య కల్యాణ్‌రామ్‌తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!