NTV Telugu Site icon

Kishan Reddy: నీ వల్ల ఏం మార్పు వచ్చిందో చెప్పాలి రేవంత్ రెడ్డి..

Kishan Reddy

Kishan Reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మొన్న ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేస్తూ.. గత ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లు అప్పు చేసినట్లు నాకు తెలియదు అన్నాడని కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్నో సభల్లో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అప్పులపై మాట్లాడిన వీడియోలు ఉన్నాయి.. రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు చెబుతున్నాడని పేర్కొన్నారు. రాష్ట్ర పరిస్థితి తెలిసి కూడా అమలు చేయలేని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో లక్ష 50 వేల కోట్లు అప్పు చేశారు.. కేసీఆర్‌కి నేనేమీ తక్కువ కాదు అన్నట్లు రేవంత్ రెడ్డి పోటీ పడుతున్నాడని కిషన్ రెడ్డి విమర్శించారు.

Read Also: Nithiin : పవన్ కళ్యాణ్ ను కలవబోతున్న నితిన్.. ఎందుకోసమంటే..?

కేసీఆర్ ను మించి అప్పులు చేయడంలో, బూతులు మాట్లాడటంలో సీఎం రేవంత్ రెడ్డి పోటీ పడుతున్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ మీ ద్వారా తెలంగాణకు ఏమీ ఒరిగిందో ప్రజలకు చెప్పాలని కోరారు. లిక్కర్ ధరల్లో, ఇసుక దందాలో మార్పు వచ్చిందా ప్రజలకు చెప్పాలని అన్నారు. 5 సంవత్సరాలు ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొ్న్నారు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు.. సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడతారని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు చేయవద్దని జీవో ఇవ్వడంతో రేవంత్ రెడ్డి కుట్ర బయట పడిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో కూడా కేసీఆర్ ఇలానే ఇచ్చాడు.. నీ వల్ల ఏం మార్పు వచ్చిందో చెప్పాలి రేవంత్ రెడ్డి అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. నెల లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నారు చేయలేదు.. మీ మేనిఫెస్టోపై ఈ బడ్జెట్ సమావేశంలో తెలంగాణ ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డిని కోరారు.

Read Also: MLC Ramagopal Reddy: ఎమ్మెల్యే పదవికి వైఎస్ జగన్ రాజీనామా చేయాలి!