NTV Telugu Site icon

Kishan Reddy : అనేక హామీలు ఇచ్చి వెన్నుపోటు పొడిచి మోసం చేశారు

Kishanreddy

Kishanreddy

మేడ్చల్ జిల్లా ఔషాపూర్, ఘట్కేసర్‌లో జరిగిన బీజేపీ యువమోర్చ రాష్ట్ర స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిదిన్నరేండ్లుగా బీఆర్​ఎస్​ ప్రభుత్వం.. అనేక హామీలు ఇచ్చి వెన్నుపోటు పొడిచి మోసం చేశారని ఆరోపించారు. అంతేకాకుండా.. రైతన్నలు, మహిళలు, కార్మికులు, నిరుద్యోగులు విషయంలో మోసం చేశారని ఆయన మండిపడ్డారు. కనీసం పేదవాళ్లకు డబుల్​బెడ్​ రూమ్​ ఇండ్లు ఇవ్వలేని పరిస్థితులో, దళితులకు, గిరిజనులకు మూడెకరాలు ఇవ్వలేని పరిస్థితిలో, విద్య, వైద్యం దెబ్బతిన్న పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తున్నదని కిషన్‌ రెడ్డి ధ్వజమెత్తారు.

Also Read : Jr NTR: ఎన్టీఆర్ ఖాతాలో మరో బ్రాండ్..

అందుకే ఈ నెల 13, 14 తేదీల్లో ఇందిరా పార్క్​ వద్ద, రాష్ట్ర బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగుల సమస్యపై దీక్ష చేపట్టామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ వైఖరితో ఇబ్బంది పడుతున్న నిరుద్యోగ యువత దీక్షకు రావాల్సిందిగా కోరుతున్నానన్నారు కిషన్‌ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సెప్టెంబర్​ 17 తెలంగాణ విమోచన ఉత్సవాలను సికింద్రాబాద్‌లోని పరేడ్​ గ్రౌండ్​లో 17 ఉదయం 8 గంటల నుంచి అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నామని కిషన్‌ రెడ్డి వెల్లడించారు. పారామిలటరీ కవాతు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని ఆయన వెల్లడించారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్రపతి నిలయంలో హైదరాబాద్​ లిబరేషన్​ డే సెలబ్రేషన్స్​ ఉంటాయని, ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల తరఫున నేను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు కిషన్‌ రెడ్డి.

Also Read : Crime News: పెళ్లికి నిరాకరించిన ప్రియురాలు.. పెట్రోల్‌ పోసుకుని ప్రియుడు సూసైడ్