Kishan Reddy : ఆర్థిక రాజధాని, వ్యవసాయం లో కీలక పాత్ర పోషించే మహారాష్ట్ర లో బీజేపీ గెలవడం సంతొషమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిన డబల్ ఇంజన్ సర్కార్ పై మహారాష్ర్ట ప్రజలు అత్యధిక ఓట్లు, సీట్లు ఇచ్చారని, గత పార్లమెంట్ ఎన్నికల్లో రిజర్వేషన్ లు ఎత్తివేస్తారని చేసిన ప్రచారం తో కాంగ్రెస్ లబ్ధి పొందిందన్నారు. కాంగ్రెస్ పార్టీ కులం, మతం, భాష పేరుతో గురివింద గింజ సామెత గా ప్రచారం చేసిందని, అన్ని రకాల నష్టాలకు , ప్రజల ఇబ్బందులకు గురి చేసిన పార్టీ కాంగ్రెస్ అని ఆయన మండిపడ్డారు. రాహుల్ గాంధీ కు మతిమరుపు పెరిగిపోయిందని, అత్యధిక కాలం ఈ దేశం లో కాంగ్రెస్ పాలించింది అనే అంశాన్ని మరిచిపోయారన్నారు. అంతటికీ బీజేపీ కారణం అని ప్రచారం చేస్తున్నారని, జార్ఖండ్, మహారాష్ర్ట ల్లో కలిపితే ఆ పార్టీ 30 సీట్లు దాటే పరిస్థితి లేదన్నారు కిషన్ రెడ్డి. మహారాష్ర్ట లో విపక్ష హోదా కూడా కాంగ్రెస్ కు రాలేదు అని, రాజ్యాంగాన్ని చేతబట్టుకుని కాంగ్రెస్ నేతలు విష ప్రచారం చేశారని ఆయన విమర్శించారు.
Priyanka Gandhi: ప్రియాంక అరంగేట్రం అదిరింది.. లోక్‌సభలో అడుగుపెట్టేదెప్పుడంటే..!
అంతేకాకుండా..’బీజేపీ నేతృత్వంలో మూడో సారి అధికారం లోకి వచ్చాము.. పెద్దల సూచన మేరకు శివసేన ను తీసుకొని పోటీ చేసి గెలిస్తే ముఖ్యమంత్రి పీఠం కోసం వెన్నుపోటు పొడిచారు… కాంగ్రెస్ తో ఉద్ధవ్ ఠాక్రే జత కట్టారు.. బీజేపీ పలు రాష్ట్రాల్లో రెండు, మూడు నాలుగో సారి అధికారం లోకి వచ్చాము.. కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాలకే పరిమితం అయింది.. బై ఎలక్షన్స్ లో కూడా బీజేపీ సత్తా చాటింది.. యూపీ లో 9 సీట్లను ఎస్పీ కి కాంగ్రెస్ అప్పగించింది అయినా అక్కడ 7 సీట్లు బీజేపీ గెలిచింది.. మహారాష్ర్ట లో గత ఎన్నికల్లో 44 సీట్లు కాంగ్రెస్ గెలిస్తే ఇప్పుడు అందులో సగం కూడా గెలవలేక పోయింది.. మహారాష్ర్ట లో నాలుగు విమానాలు సిద్దం చేసారు… పలితాలు రాగానే ఎమ్మెల్యేలను తరలించేందుకు అద్భుత ప్లానింగ్ చేసింది.. ప్రజల నాడి నీ పసిగట్టలేక మరోసారి ప్రజల ముందు నవ్వుల పాలు అయింది.. బాల సాహెబ్ ఠాక్రే సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్ తొ కలిసినందుకు .. బాలాసాహెబ్ ఠాక్రే ను నమ్మేవాళ్ళు అందరూ మూకుమ్మడి గా మోడీ నేతృత్వం లోని పార్టీలకు ఓటు వేశారు..
ఉద్ధవ్ ఠాక్రే కు వచ్చిన ఓట్లు కూడా శివసేన వ్యతిరేక ఓట్లు.. రాజకీయ అవకాశ వాదం, అహంకారానికి మహారాష్ర్ట ప్రజలు బుద్ధి చెప్పారు.. జార్ఖండ్ లో అనుకున్న పలితాలు సాధించలేకపోయాము.. గతం లో బీజేపీ కి వచ్చిన ఓట్లను, సీట్లను జార్ఖండ్ లో నిలబెట్టుకోగలిగాం.. సంజయ్ రౌత్ ఒక సిగ్గులేని రాజకీయ నేత.. పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ వచ్చినప్పుడు evm ల గురుంచి ఎందుకు మాట్లాడలేదు.. తెలంగాణ లో, కర్ణాటక లో, హిమాచల్ లో వాళ్లు గెలిస్తే evm లు బాగున్నట్టు… బీజేపీ గెలిస్తే EVM లు టాంపర్ అయినట్టు.. ఇతర దేశాలకు వెళ్లి దేశం పట్ల, మోడీ పట్ల విషం చిమ్మడం కాంగ్రెస్ కు అలవాటు అయింది.. వయనాడ్ లో బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది… బీజేపీ సాధారణ కార్యకర్తను అక్కడ పోటీకి నిలబెట్టింది.. నాందేడ్ లో బీజేపీ గెలవబోతుంది.. మహారాష్ర్ట కీలకమైన రాష్ట్రం…. మహారాష్ర్ట ప్రజలకు కృతజ్ఞతలు… రేవంత్ రెడ్డి ప్రచారం పని చేయలేదు.. అయన వసూల్ చేసి పంపించిన డబ్బులు పనిచేయలేదు.. ఇక్కడ టీఆర్ఎస్ పోవాలని, 6 గ్యారంటీ ల కోసం కాంగ్రెస్ కు తెలంగాణ లో ఓటు వేశారు’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.