Kishan Reddy : ప్రపంచ బొగ్గు ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉంది
- 2047 వికసిత భారత లక్ష్యాల్లో బొగ్గు రంగం చాలా కీలకం
- ప్రపంచ బొగ్గు ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉంది
- బొగ్గు నిల్వల్లో ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది : కిషన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy : బొగ్గు శాఖ పురోగతిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 2047 వికసిత భారత లక్ష్యాల్లో బొగ్గు రంగం చాలా కీలకమని,
ప్రపంచ బొగ్గు ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉందన్నారు. బొగ్గు నిల్వల్లో ప్రపంచంలో 5వ స్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద బొగ్గు వినియోగదారుగా భారతదేశం ఉందని, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బొగ్గు గని గెవరా మన దేశంలో ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. కోలిండియా బొగ్గు మంత్రిత్వ శాఖ కీలకమైన విభాగమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది కోలిండియా స్వర్ణజయంత్యుత్సవాలు జరుపుకుంటోందన్నారు కిషన్ రెడ్డి. కోలిండియా ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ అని, పవర్, స్టీల్, సిమెంట్, అల్యూమినియం, ఫెర్టిలైజర్, హెవీ ఇండస్ట్రీస్ రంగాల్లో బొగ్గు కీలకమైన అంశమన్నారు. భారతదేశంలో బొగ్గు ద్వారానే 74% విద్యుదుత్పత్తి జరుగుతోందని, రానున్న దశాబ్దాల్లోనూ బొగ్గు ఒక కీలకమైన ఇంధనంగా ప్రత్యేకతను సంతరించుకుందని కిషన్ రెడ్డి వెల్లడించారు.
Also Read
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
అంతేకాకుండా..’బొగ్గును నల్ల బంగారమని, కుకింగ్ కోల్ ను బ్లాక్ డైమండ్ అంటారు. దేశంలో వివిధ రంగాలకు బొగ్గు అత్యంత కీలకమైన ఇంధనం. 2014లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. వివిధ రంగాల్లో సంస్కరణలు వచ్చాయి. బొగ్గు రంగంలోనూ మౌలికమార్పులు, విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. పారదర్శకంగా కోల్ బ్లాక్స్ వేలం వేయడం, కమర్షియల్ కోల్ మైనింగ్, పాలసీ రిఫార్మ్స్, కోల్ గ్యాసిఫికేషన్, టెక్నాలజీ వంటి వినియోగం పెరిగింది. భారత బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది. నిర్ణయాలు తీసుకుని.. పారదర్శకంగా వాటిని అమలు చేయడం వల్లే ఉత్పత్తి పెరిగింది. 2023-24లో 998 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది. 2014లో ఇది కేవలం 609 కోట్ల బొగ్గు ఉత్పత్తి మాత్రమే జరిగేది. బొగ్గు రంగంలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యం పెరిగిన తర్వాత మరింత పోటీ పెరిగింది. దీని ద్వారా చాలా సానుకూల మార్పులు వచ్చాయి. ఇప్పటివరకు 10 విడతల పాటు పారదర్శక వేలం పూర్తయింది. 184 బ్లాక్స్ వేలం జరిగింది’ అని కిషన్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. ఇండియా తుది జట్టు ఇదే..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..