అదిరే అభి హీరోగా స్వాతి మందల్ హీరోయిన్‌గా బాబీ ఫిలిమ్స్, ఓం సాయి ఆర్ట్స్, సి ఆర్ ఎస్ క్రియేషన్స్ పతాకంపై రాబోతున్న చిత్రం ‘ది డెవిల్స్ చైర్’. గంగ సప్త శిఖర దర్శకత్వంలో కె కె చైతన్య, వెంకట్ దుగ్గి రెడ్డి, చంద్ర సుబ్బగారి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ ఫిబ్రవరి 21న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో సినిమా యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
Dhanush vs Pradeep: సీనియర్ vs జూనియర్ ధనుష్.. గెలిచేదెవరు?
ఇక ఈ క్రమంలో అదిరే అభి మాట్లాడుతూ.. ‘నేను ఇండస్ట్రీకి వచ్చి 23 ఏళ్లు అవుతోంది. ఈ 23 ఏళ్లు ఉన్నందుకు సంతోషపడాలా? ఇంకా స్ట్రగుల్స్ పడుతున్నాని బాధపడాలా? అన్నది అర్థం కావడం లేదు. నేను ఈ 23 ఏళ్లు కష్టపడుతూనే ఉన్నాను. ఇంకో 23 ఏళ్లు అయినా కష్టపడతా, సక్సెస్ అయిన తరువాత బయటకు వెళ్తాను. ఒకరో ఇద్దరికో అయినా ఇన్ స్పైరింగ్‌గా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు సినిమాల మీదున్న ప్యాషన్‌తోనే అన్నీ వదిలేసుకుని ఇండస్ట్రీలోకి వచ్చాను. ప్రతీ శుక్రవారం ఓ ఆర్టిస్ట్ తలరాత మారిపోతుంది. ఈ శుక్రవారం మేం రాబోతోంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ది డెవిల్స్ చైర్ అనే టైటిల్ అన్ని భాషలకు యాప్ట్‌గా ఉంటుంది. మనిషికి ఉండే దురాశ మీదే ఈ చిత్రాన్ని తీశాం. మంచి కాన్సెప్ట్‌తో పాటు మంచి సందేశం ఇచ్చేలా ఉంటుంది. ఈ చిత్రం అందరినీ భయపెట్టేలా ఉంటుందని అన్నారు.