Kiran Abbavaram: హీరోలు కానీ, హీరోయిన్లు కానీ తొలి సినిమాలో తమతో నటించిన వారిపై మనసు పారేసుకుంటారు అనేది నమ్మదగ్గ వాస్తవం.. అందుకు చాలా జంటలు ఉదాహరణగా చెప్పొచ్చు. నాగ చైతన్య- సమంత, ఆది పినిశెట్టి- నిక్కీ.. ఇలా చాలా జంటలు తమ తొలి సినిమా సెట్స్ మీదనే భాగస్వాములతో ప్రేమలో పడ్డారు. తాజాగా ఈ లిస్ట్ లోకి కుర్రహీరో కిరణ్ అబ్బవరం కూడా చేరిపోయినట్లు కనిపిస్తున్నాడు. ఈ మధ్యనే వినరో భాగ్యం విష్ణుకథ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ హీరో .. కొన్నేళ్లుగా ఒక హీరోయిన్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు రహస్య గోరఖ్. అరే.. అదేనండీ.. రాజావారు రాణిగారు హీరోయిన్ రహస్య. కిరణ్ మొదటి సినిమా రాజావారు రాణిగారు. అందులో కిరణ్ సరసన నటించి మెప్పించింది రహస్య. ఈ సినిమాతో మంచి పేరు అయితే వచ్చింది కానీ అవకాశాలు మాత్రం రాలేదు. అయితే ఈ సినిమా షూటింగ్ లోనే కిరణ్- రహస్య మధ్య ప్రేమ చిగురించిందని టాక్.
Naresh- Pavitra: జనాలు మీ కంటికి పిచ్చోళ్లలా కనిపిస్తున్నారా..?
ఇక తాజాగా ఈ జంట కలిసి వెకేషన్ కు వెళ్లిన ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. వినరో భాగ్యం విష్ణు కథ సినిమా హిట్ అయ్యాక విష్ణు కాశ్మీర్ ట్రిప్ కు వెళ్లిన సంగతి తెల్సిందే. అయితే ఎప్పుడు కిరణ్ ఫోటోలను పోస్ట్ చేసినా ఒక్కడే ఉన్న ఫోటోలను షేర్ చేస్తాడు. ఈ మధ్యనే కాశ్మీర్ లో ఉన్న ఒక ఫోటోను షేర్ చేశాడు. ఇక ఆ తరువాత రహస్య సైతం తన వెకేషన్ ఫోటోలను షేర్ చేసింది. అంతా బావుంది కానీ.. ఇద్దరు ఉన్న బ్యాక్ గ్రౌండ్ సేమ్ ఉండడంతో నెటిజన్లు పట్టేశారు. కాశ్మీర్ ఎవరు వెళ్లినా అదే లొకేషన్ ఉంటుంది అనుకోవచ్చు. కానీ వారు పెంచుకుంటున్న కుక్క సేమ్ ఉండదు కదా. ఇద్దరు ఫోటోలలో బ్యాక్ గ్రౌండ్ సేమ్.. మనుషులు సేమ్.. కుక్క కూడా సేమ్.. దీంతో ఈ జంట కలిసే వెకేషన్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోటోలు చూసి అభిమానులు కిరణ్ అన్నా దొరికిపోయావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ ఫోటోలపై కిరణ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.