NTV Telugu Site icon

Killer Wolf: డ్రోన్ కెమెరాకు చిక్కిన 10 మందిని చంపిన కిల్లర్ తోడేలు..

Wolf

Wolf

యూపీలోని బహ్రైచ్ జిల్లాలో కిల్లర్ తోడేళ్ల భయం కొనసాగుతోంది. మహసీలోని ఘఘ్రా బేసిన్‌తో సహా వివిధ 55 గ్రామాలలో సుమారు రెండున్నర నెలలుగా తోడేళ్లు భీభత్సం సృష్టిస్తున్నాయి. అటవీ శాఖ డ్రోన్ కెమెరాలో బంధించిన ఆరు తోడేళ్లలో ఐదు అధికారులు పట్టుకోగా.. ఒక తోడేలు మాత్రం అటవీశాఖకు సవాలుగా మారింది. సెప్టెంబరు 16న కోలెల గ్రామంలో మేకను వేటాడిన తోడేలు.. ఆ తర్వాత ఆచూకీ లభించలేదు. 10 రోజుల పాటు సైలెంట్ మోడ్‌లో ఉండి 10 మందిని చంపిన హంతక తోడేలు బుధవారం సాయంత్రం అటవీ శాఖ డ్రోన్ కెమెరాకు చిక్కింది.

Read Also: Student Died: నీళ్లు తాగేందుకు పరుగెత్తుకుంటూ వెళ్లిన విద్యార్థి మృతి.. కారణమిదే..?

మహాసి ప్రాంతంలో నెత్తుటి ఆటలు ఆడుతున్న ఐదు క్రూరమైన తోడేళ్లను సీసయ్య చూడామణి గ్రామంలో అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ఆరవ తోడేలు కోసం ఆ శాఖ బృందాలు సీసయ్య మరియు ఘఘ్రా బేసిన్‌తో సహా అనేక సమీప గ్రామాలలో వెతుకుతున్నారు. సెప్టెంబర్ 16న కోలెలకు చెందిన రామ్ కిషన్ మేకను ఎత్తుకెళ్లి ఎమ్మెల్యే సురేశ్వర్ సింగ్ ఇంటి ముందు ఉన్న చెరుకు తోటలోకి వెళ్లిపోయిందని డీఎఫ్‌వో అజిత్ ప్రతాప్ సింగ్ తెలిపారు.

Read Also: Himachal Pradesh: హిమాచల్ సర్కార్ యూటర్న్.. నేమ్ బోర్డు డిస్‌ప్లే ఉత్తర్వు విత్‌డ్రా

ఈ క్రమంలో.. ఎమ్మెల్యేతో పాటు అటవీ సిబ్బంది బృందాలు, గ్రామస్తులంతా చుట్టుముట్టి ఉచ్చు బిగించినా తోడేలు తప్పించుకుంది. అప్పటి నుండి అదెక్కడుందో గుర్తించలేదు. బుధవారం ఈ డ్రోన్ సీసయ్య చూడామణి నుంచి చహలారి వైపు వెళ్తున్న కెమెరాలో తోడేలు కనిపించింది. ఈ క్రమంలో.. దానిని పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బహ్రైచ్‌లోని మహసీ తహసీల్‌లో గత 200 రోజులుగా నరమాంస భక్షక తోడేళ్ల భయం ఉంది. నరమాంస భక్షక తోడేళ్ల సమూహం ఇప్పటివరకు 9 మంది పిల్లలతో సహా 10 మందిని చంపి తినేసింది. అలాగే.. దాని దాడిలో 60 మందికి పైగా గాయపడ్డారు.