వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లో జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన లాస్య మధు దంపతుల కూతురు అద్విత(4) అదృశ్యమైంది. డిసెంబర్ 28న బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 23న ముగ్గురు మహిళలు చిన్నారి అద్వితను అపహరించినట్లుగా పోలీసులు నిర్ధారించారు. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా అనుమానిత మహిళల చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. పది రోజులుగా విస్తృతంగా గాలిస్తున్నా ఆచూకీ లభించలేదు. రాష్ట్ర సరిహద్దులు దాటిందన్న అనుమానంతో పోలీసుల విస్తృత గాలింపు…