Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Khawaja Asif Slams Indias Operation Sindhu Remarks Tensions Rise Ahead Of Pahalgam Attack Anniversary

Pakistan: ఆపరేషన్ సిందూర్ మర్చిపోయారేమో.. భారత్‌కే వార్నింగ్ ఇస్తున్న పాక్ రక్షణమంత్రి..

Published Date :April 3, 2026 , 4:59 pm
By Venu Goapl Reddy
  • ఆపరేషన్ సిందూర్ దెబ్బ మరిచిపోయినట్లు ఉన్నారు..
  • భారత్‌పై వేగంగా దాడి చేస్తాం అంటూ పాక్ హెచ్చరిక..
Pakistan: ఆపరేషన్ సిందూర్ మర్చిపోయారేమో.. భారత్‌కే వార్నింగ్ ఇస్తున్న పాక్ రక్షణమంత్రి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Pakistan: గతేడాది జరిగిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ దాడుల్ని పాకిస్తాన్ మర్చిపోయినట్లుంది, అందుకే భారత్‌ను ఉద్దేశించి అవాకులు చెవాకులు పేలుతోంది. గురువారం, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఇరాన్ యుద్ధం నీడలో పాకిస్తాన్ భారత్‌పై కుట్ర పన్నినా, ఏదైనా దుస్సాహసానికి దిగినా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో కేవలం 22 నిమిషాల్లోనే కాళ్ల బేరానికి వచ్చిన సంగతిని గుర్తు చేశారు.

Read Also: Oracle Layoffs: 12 ఏళ్ల సర్వీస్ ఉన్నా కనికరం చూపని కంపెనీ.. హైదరాబాద్, పూణె ఐటీ ఉద్యోగుల కన్నీళ్లు!

ఇదిలా ఉంటే, రాజ్‌నాథ్ వ్యాఖ్యలపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందించారు. పాకిస్తాన్‌పై ఏ దాడి జరిగినా తమ ప్రతిస్పందన వేగంగా, ప్రణాళికాబద్ధంగా, నిర్ణయాత్మకంగా ఉంటుందని హెచ్చరించారు. ‘‘పహల్గామ్ దాడి వార్షికోత్సవం సమీపిస్తున్న తరుణంలో పదే పదే చేసే ఈ ప్రసంగాలు బలాన్ని కాదు, స్పష్టంగా వ్యూహాత్మక ఆందోళనలను ప్రతిబింబిస్తున్నాయి’’ అని ఆసిఫ్ అన్నారు. ఇలాంటి బెదిరింపులు కొత్తేమీ కాదని, ఇది ఊహించిన ధోరణిలో భాగే అని అంతర్గత బలహీనతలను బయటపెట్టి, స్వప్రయోజన రాజకీయ ప్రయోజనాల కోసం నిరాధారమైన ఆరోపణల ముసుగులో ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోందని భారత్‌పై ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ శాంతి, స్థిరత్వానికి కట్టుబడి ఉందని, కానీ సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు సిద్ధంగా ఉందని, తమ దాడి వేగంగా నిర్ణయాత్మకంగా ఉంటుందని అన్నారు.

గత ఏడాది ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడి ఇరు దేశాల మధ్య స్వల్ప యుద్ధానికి కారణమైంది. 25 మందిని బలిగొన్న ఈ దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్తాన్‌పై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో పాకిస్తాన్, పీఓకేలోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. వందలాది మంది ఉగ్రవాదుల్ని హతమార్చింది. పాకిస్తాన్ సైన్యం భారత్‌పై దాడికి ప్రయత్నించడంతో పాక్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన వైమానిక స్థావరాలపై భారత ఎయిర్ ఫోర్స్ విరుచుకుపడింది. నూర్ ఖాన్, చక్లాలా, రహీంయార్ ఖాన్, సర్దోదా వంటి ఎయిర్ బేసుల్ని భారత్ ధ్వంసం చేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • India Pakistan border tensions
  • Khawaja Asif
  • Operation Sindoor
  • Pahalgam terror attack
  • Pakistan Air Force bases destroyed

తాజావార్తలు

  • Pakistan: ఆపరేషన్ సిందూర్ మర్చిపోయారేమో.. భారత్‌కే వార్నింగ్ ఇస్తున్న పాక్ రక్షణమంత్రి..

  • Harish Rao : గిరిజనుల ఏ ఒక్క హామీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదు

  • Oracle Layoffs 2026: ఎలాంటి హెచ్చరికలు లేకుండా 30 వేల మంది తొలగింపు.. కన్నీటి పర్యంతమైన ఉద్యోగులు..

  • Oracle Layoffs: 12 ఏళ్ల సర్వీస్ ఉన్నా కనికరం చూపని కంపెనీ.. హైదరాబాద్, పూణె ఐటీ ఉద్యోగుల కన్నీళ్లు!

  • Bank Jobs: పంజాబ్ & సింధ్ బ్యాంక్‌లో 1000 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు.. గ్రాడ్యుయేట్స్‌కు బంపర్ అవకాశం

ట్రెండింగ్‌

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions