Oracle Layoffs: 12 ఏళ్ల సర్వీస్ ఉన్నా కనికరం చూపని కంపెనీ.. హైదరాబాద్, పూణె ఐటీ ఉద్యోగుల కన్నీళ్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oracle Layoffs: ఒరాకిల్ కార్పొరేషన్ (Oracle Corporation) ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చింది. వేలాది మంది ఉద్యోగులను రోడ్డున పాడేసింది. ఉద్యోగాలు తొలగిస్తున్నట్టు ఈమెయిళ్ళ పంపడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఉదయం 6 గంటల ప్రాంతంలో పంపిన ఈ ఈమెయిళ్ళు ఉద్యోగులను పూర్తిగా ఆశ్చర్యానికి గురిచేశాయి. ఎందుకంటే ఈ ఉద్యోగులను తొలగించే ముందు ఎలాంటి నోటీసులు, ముందస్తు సూచనలు చేయలేదు. పలు నివేదికలు, ఉద్యోగుల ప్రకటనల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా సుమారు 30,000 మంది ఉద్యోగులను తొలగించారు. ఇది కంపెనీ ఉద్యోగులలో దాదాపు 18 శాతానికి సమానం. ఒరాకిల్ హెల్త్, సేల్స్, క్లౌడ్, కస్టమర్ సక్సెస్, నెట్‌సూట్ వంటి కీలక విభాగాలలో ఈ కోతలు విధించారు. భారతదేశంలోనూ దీని ప్రభావం కనిపించింది.
READ MORE: Iran War: భారత్‌కు వస్తున్న ఇరాన్ చమురు నౌక చైనాకు మళ్లింపు.. కారణం ఏమిటి..?
Also Read
- RBI: ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
- Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
- రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
- SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
పుణె, హైదరాబాద్ వంటి నగరాల్లో ఉద్యోగాలు కోల్పోయిన బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు తమ అనుభవాలను పంచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. గత 12 ఏళ్లుగా కంపెనీలో పనిచేస్తున్న పూణెకు చెందిన ఒక సీనియర్ ఐటీ ఇంజనీర్ మాట్లాడుతూ.. ” నేను రోజులాగే లాగిన్ అయ్యాను. కానీ నా సిస్టమ్ యాక్సెస్ నిలిపివేసినట్లు కనిపించింది. ఆ తర్వాత కొద్దిసేపటికే, నా ఉద్యోగ తొలగింపును తెలియజేస్తూ ఇమెయిల్ వచ్చింది. నాకు విస్తృతమైన అనుభవం ఉంది. ప్రస్తుతం ఉన్నత పదవిలో కొనసాగుతున్నాను. అలాంటి నాకే ముందుగా ఎలాంటి నోటీసు ఇవ్వలేదు.” అని స్పష్టం చేశారు. అయితే, కంపెనీ ప్రస్తుత నెల జీతంతోపాటు రెండు నెలల అదనపు జీతం, వేతనం లేని సెలవు రూపంలో పరిహారాన్ని అందించింది.
READ MORE: Bandla Janani: బండ్ల ఇంట పెళ్లి సందడి.. కాబోయే అల్లుడితడే..
ఏడేళ్ల కిందట ఒరాకిల్‌లో చేరిన పూణెకు చెందిన మరో ఉద్యోగి, తాను ఇటీవల గృహ రుణం తీసుకుని ఇల్లు కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఉద్యోగం కోల్పోయిన బాధితుడు ఈఎంఐ చెల్లింపు గురించి ఆందోళన చెందుతున్నారు. ఆయన కుమార్తె ఇటీవలే స్కూల్‌కు పంపించారట. ఈ తరుణంలో తన ఆర్థిక ఒత్తిడి మరింత పెరుగుతోందని.. ప్రస్తుతం కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లు చెప్పాడు. తమ పనితీరును కనీసం పరిశీలించకుండానే తమను తొలగించారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒరాకిల్‌లో 12 ఏళ్లుగా పనిచేస్తున్న పూణెకు చెందిన మరో సీనియర్ ఐటీ ఇంజనీర్ మాట్లాడుతూ..”నేను ఉన్నత పదవిలో కొనసాగుతున్నాను. నాకు ఏ అధికారి నుంచి గానీ, హెచ్‌ఆర్ నుంచి గానీ ఉద్యోగ తొలగింపు గురించి ఎలాంటి సమాచారం అందలేదు. దానికి బదులుగా నన్ను తొలగిస్తున్నట్లు నేరుగా ఈమెయిల్ వచ్చింది. మరుసటి రోజు ప్రాజెక్టులో ఏం పని చేయాలోనని ఆలోచిస్తూ పడుకున్నాను. ఉదయాన్నే నిద్రలేవగా ఆ ఈమెయిల్ చూసి నేను దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే, కంపెనీ ఒక నెల జీతంతో పాటు మరో రెండు నెలల జీతం చెల్లిస్తోంది.” అని వెల్లడించారు.
READ MORE: Haier Desert Rose AC: భారతదేశపు మొట్టమొదటి సెల్ఫ్-క్లీనింగ్ ఏసీ ప్రారంభం.. 10 సెకన్లలో చల్లని గాలి
హైదరాబాద్‌కు చెందిన మరో ఐటీ ఇంజనీర్ తన వివరణ ఇచ్చారు. “నేను ఒరాకిల్‌లో 10 ఏళ్లుగా పనిచేస్తున్నాను. వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగుతోంది. నేను అప్పుడప్పుడు సమావేశాల కోసం మాత్రమే ఆఫీసుకు వెళ్లాల్సి వచ్చేది. కోవిడ్ వంటి క్లిష్ట సమయాల్లోనూ నేను కంపెనీ కోసం పనిచేశాను. నా మంచి పనితీరు వల్ల నాకు ప్రమోషన్లు సైతం వచ్చాయి. కానీ కంపెనీ ఒకరి పనితీరు మరొకరికి ఎలా ఉందో కూడా చూడకుండా, నేరుగా నేరుగా ఉద్యోగం నుంచి తొలగించారు. ఇది నాకు చాలా దిగ్భ్రాంతి కలిగించింది. కంపెనీ ఉద్యోగాల తొలగింపునకు డబ్బు ఇస్తోంది. ఇంత సడెన్‌గా తొలగిస్తే నేను కుటుంబాన్ని ఎలా పోషిస్తాను?” అని తీవ్ర ఆవేదనకు లొనయ్యారు.
తాజావార్తలు
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
-
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
-
Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!