స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?
- చైనాలో Honor X80i స్మార్ట్‌ఫోన్ లాంచ్
- స్లిమ్ డిజైన్‌తో పాటు 6.7 అంగుళాల FHD+ LTPS LCD డిస్‌ప్లే
- MediaTek Dimensity 6080 ప్రాసెసర్
- 100MP ప్రైమరీ కెమెరా + 2MP డెప్త్ సెన్సార్, 8MP ఫ్రంట్ కెమెరా..
- 4500mAh బ్యాటరీ, 35W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honor X80i Launched: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ హానర్ (Honor) చైనా మార్కెట్లో తన సరికొత్త ‘X’ సిరీస్ స్మార్ట్ ఫోన్ Honor X80iని అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్ బడ్జెట్ ధరలో అత్యుత్తమ ఫీచర్లను అందించేలా తీర్చిదిద్దారు. మరి ఈ కొత్త ఫీచర్స్ ఏంటో చూసేద్దామా..
Raghav Chadha vs AAP: మోడీకి భయపడి సమోసాల ధరల గురించి మాట్లాడతావా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
Also Read
- Top 5 Expensive Phones: భారత్‌లో అత్యంత ఖరీదైన 5 స్మార్ట్ఫోన్లు.. 2TB స్టోరేజ్, ధరలు తెలిస్తే షాక్!
- Vivo X Fold 6: వివో X Fold 6 త్వరలో మార్కెట్లోకి.. Geekbenchలో లిస్టింగ్.. 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ
- Boltt Ace 5G : విడుదలైన తర్వాత రోజే మొత్తం Sold Out.. మరో కొత్త తేదీ ప్రకటన.. రూ.9,999లకే 5జీ మొబైల్..
- Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు '+91' ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
హానర్ X80i స్మార్ట్ ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ HD+ (1,080×2,388 పిక్సెల్స్) LTPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ ను సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల స్క్రీన్ స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం చాలా స్మూత్ గా ఉంటుంది. ఫోన్ చాలా స్లిమ్ గా ఉండటమే కాకుండా చేతిలో పట్టుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో MediaTek Dimensity 6080 చిప్‌సెట్ ను అమర్చారు.
ఈ కొత్త ఫోన్ 8GB/12GB ర్యామ్ ఆప్షన్లతో పాటు, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో లభిస్తుంది. ఆండ్రాయిడ్ ఆధారిత హానర్ సొంత MagicOS పై ఈ ఫోన్ రన్ అవుతుంది. వీటితోపాటు ఫోటోగ్రఫీ ప్రియుల కోసం హానర్ ఇందులో అద్భుతమైన కెమెరా సెటప్ ను అందించింది. వెనుకవైపు 100MP ప్రైమరీ కెమెరా & 2MP డెప్త్ సెన్సార్ తో ఉన్న డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం ముందు భాగంలో 8MP కెమెరాను అమర్చారు.
Pakistan Crisis: లీటర్ పెట్రోల్ 458, కిలో టమోటా 250.. ఒక్క నెలలోనే రూ. 900 పెరిగిన గ్యాస్ సిలిండర్!
ఇక ఇందులో 4,500mAh సామర్థ్యం గల బ్యాటరీ ఉంది. ఇది 35W ఫాస్ట్ ఛార్జింగ్ను సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల ఫోన్ త్వరగా ఛార్జ్ అవుతుంది. చైనా మార్కెట్లో హానర్ X80i 8GB + 256GB వేరియంట్ 1,599 యువాన్లు (రూ. 18,000), 12GB + 256GB వేరియంట్ 1,899 యువాన్లు (రూ. 21,000) ఉన్నాయి. ఇది క్లౌడ్ బ్లూ (Cloud Blue), పింక్ కోరల్ (Pink Coral), మిడ్ నైట్ బ్లాక్ (Midnight Black) వంటి ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. భారత్ లో ఈ ఫోన్ విడుదలపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
తాజావార్తలు
-
Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు… ఓటీటీ డీల్ 100 కోట్లు?..
-
CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
-
Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
-
Flight Turbulence: టర్కిష్ ఎయిర్‌లైన్స్ TK663 విమానంలో తీవ్ర కుదుపులు.. మూడు సార్లు ల్యాండింగ్ విఫలం, చివరికి డైవర్ట్
-
Asia Cup 2026 Final: భారత్ vs శ్రీలంక ఫైనల్.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!