Oracle Layoffs 2026: ఎలాంటి హెచ్చరికలు లేకుండా 30 వేల మంది తొలగింపు.. కన్నీటి పర్యంతమైన ఉద్యోగులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oracle Layoffs 2026: ప్రపంచ ఐటీ రంగాన్ని కుదిపేసేలా Oracle Corporation లో భారీ స్థాయిలో ఉద్యోగ కోతలు చోటుచేసుకున్నాయి. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా ప్రపంచవ్యాప్తంగా సుమారు 30,000 మంది ఉద్యోగులను తొలగించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగులలో దాదాపు 18 శాతానికి సమానమని సమాచారం. మంగళవారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉదయం 6 గంటల ప్రాంతంలో వేలాది మంది ఉద్యోగులకు తమ ఉద్యోగాలు రద్దు చేసినట్లు ఈమెయిళ్లు రావడంతో వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అకస్మాత్తుగా వచ్చిన ఈ నిర్ణయం ఉద్యోగులను మానసికంగా తీవ్రంగా కుంగుబాటుకు గురిచేసింది..
Read Also: AP Weather Alert: అలర్ట్.. 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
Also Read
- Drinking Water Alert: పండగ వేళ హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం!
- Sai Pallavi: సీత పాత్రతో చాలా నేర్చుకున్నా.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు.!
- 29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
- Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
ఈ తొలగింపులు ఒరాకిల్ హెల్త్, సేల్స్, క్లౌడ్, కస్టమర్ సక్సెస్, నెట్సూట్ వంటి కీలక విభాగాలను ప్రభావితం చేశాయి. భారతదేశంలోని పూణే, హైదరాబాద్ నగరాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై ఈ ప్రభావం మరింతగా పడింది. తమ ఉద్యోగాలు కోల్పోయిన వారు తీవ్ర ఆర్థిక, మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు వెల్లడించారు. పూణేకు చెందిన 12 ఏళ్ల అనుభవం ఉన్న ఒక సీనియర్ ఐటీ ఇంజనీర్ మాట్లాడుతూ, తాను సాధారణంగా పనికి లాగిన్ అవ్వగా తన సిస్టమ్ యాక్సెస్ నిలిపివేయబడిందని, కొద్దిసేపటికే ఉద్యోగం కోల్పోయినట్లు ఈమెయిల్ వచ్చిందని తెలిపారు. ఇంత అనుభవం ఉన్నప్పటికీ ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని చెప్పారు. అయితే, కంపెనీ ఒక నెల జీతం, రెండు నెలల అదనపు జీతం రూపంలో పరిహారం అందించినట్లు తెలిపారు.
మరో ఉద్యోగి ఇటీవల గృహ రుణం తీసుకుని ఇల్లు కొనుగోలు చేసినట్లు చెబుతూ, ఇప్పుడు ఈఎంఐలు ఎలా చెల్లించాలన్న ఆందోళన వ్యక్తం చేశాడు. కుటుంబ ఖర్చులు, పిల్లల విద్య వంటి అంశాలు తనపై భారీ ఒత్తిడిని పెంచుతున్నాయని వాపోయాడు. హైదరాబాద్‌కు చెందిన మరో ఐటీ ఉద్యోగి మాట్లాడుతూ, తాను 10 సంవత్సరాలుగా కంపెనీలో పనిచేస్తున్నానని, కోవిడ్ వంటి క్లిష్ట సమయంలో కూడా సంస్థకు సేవలందించానని చెప్పారు. తన పనితీరును కూడా పరిగణనలోకి తీసుకోకుండా ఉద్యోగం నుంచి తొలగించడం తీవ్రంగా బాధించిందన్నారు. “కంపెనీ పరిహారం ఇస్తోంది కానీ కుటుంబాన్ని ఎలా పోషించాలి?” అని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే, పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం, సాధారణంగా ఐటీ రంగంలో ప్రతి ఏడాది 4-5 శాతం ఉద్యోగ కోతలు జరుగుతుంటాయి. అయితే, ఈసారి ఒరాకిల్ తీసుకున్న నిర్ణయం చాలా పెద్దదిగా భావిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరగడం వంటి అంశాలు ఈ నిర్ణయానికి కారణాలుగా పేర్కొంటున్నారు. గత దశాబ్దంలో ఇదే అతిపెద్ద ఉద్యోగ కోత కావచ్చని సంస్థలోని ఉన్నతాధికారి ఒకరు సూచించారు. అయితే మారుతున్న పరిస్థితుల్లో 2026-27 ఆర్థిక సంవత్సరంలో కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా పెరగవచ్చని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Drinking Water Alert: పండగ వేళ హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం!
-
EMI: అప్పు చేసి చిప్ప కూడు..! చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా పండుగల వేళ కొంతమంది హెచ్చులు!
-
Sanju Samson: రజనీకాంత్‌పై అభిమానం నెక్స్ట్ లెవల్.. ‘జైలర్ 2’ కోసం థియేటర్ మొత్తం బుక్ చేసిన సంజు శాంసన్!
-
Tuesday Astrology: విజయదశమి నాటి దినఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని లాభాలు!
-
Chairman’s Desk : ఎల్‌నినో సంక్షోభం.. ఒత్తిడిలో ప్రపంచం..!
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!