Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తలపించేలా హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. నగర నలుమూలల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి మహా గణపతిని దర్శించుకుంటున్నారు. రాత్రి సమయం సమీపించే కొద్దీ బడా గణేష్ దర్శన లైన్లు కిటకిటలాడుతున్నాయి. సాధారణ భక్తుల కోసం ఏర్పాటు చేసిన నాలుగు క్యూ లైన్లతో పాటు వీఐపీ మార్గం కూడా పూర్తిగా భక్తులతో కిక్కిరిసిపోయింది. తోపులాటలు జరగకుండా చూసేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. భక్తులు క్యూ లైన్లలో నిలబడి త్వరగా స్వామివారిని దర్శించుకునేలా రోప్ పార్టీ సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.
భక్తుల రద్దీ, భద్రతా ఏర్పాట్లపై ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి ఎన్టీవీతో మాట్లాడుతూ కీలక వివరాలు వెల్లడించారు. ఉత్సవాలు ముగిసే వరకు తొమ్మిది రోజుల పాటు ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద అత్యంత పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఆమె స్పష్టం చేశారు. లా అండ్ ఆర్డర్ పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, కుటుంబాలతో వచ్చే భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేకంగా షీ టీమ్స్ సిబ్బందిని రంగంలోకి దించారు. రద్దీని ఆసరా చేసుకుని తిరిగే పోకిరీలు, ఈవ్ టీజర్లు అలాగే జేబుదొంగలు, పిక్ పాకెటర్లపై నిఘా ఉంచేందుకు నిపుణులైన పోలీసులను నియమించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పక్కా ప్రణాళికతో భద్రతా చర్యలు చేపట్టారు.
Also Read
- UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
- CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
- Ilhan Omar: సోదరుడితో పెళ్లి ఆరోపణలు.. అమెరికా ఎంపీ ఇల్హాన్ ఒమర్‌పై విచారణ!
- OTR: ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్, హరీష్ రావు మాస్టర్ ప్లాన్! BRS వ్యూహం ఏంటి?
భక్తుల కదలికలను ఎప్పటికప్పుడు గమనించేందుకు భారీ స్థాయిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ నుంచి ప్రత్యేక అధికారుల బృందం నిరంతరం సీసీ కెమెరాల ద్వారా ప్రతి కదలికను పర్యవేక్షిస్తూ తగిన ఆదేశాలు జారీ చేస్తోంది. తొమ్మిది రోజుల పాటు జరిగే పూజా కార్యక్రమాలతో పాటు, చివరి రోజు అత్యంత వైభవంగా జరిగే నిమజ్జన ఊరేగింపు పూర్తయ్యే వరకు ఇదే స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమల్లో ఉంటాయని డీసీపీ స్పష్టం చేశారు. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో గణపతిని దర్శించుకునేలా అన్ని విభాగాల సమన్వయంతో ముందడుగు వేస్తున్నట్లు తెలిపారు. పోలీసుల పర్యవేక్షణ, పటిష్టమైన బందోబస్తు మధ్య భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా పూజలు పూర్తి చేసుకుని వెళ్తున్నారు.
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?