Kesineni Nani: నాన్నా పిట్టల దొర.. ప్రెస్‌మీట్ పెట్టి పిట్ట కథలు బాగా చెప్పావు!
- కేశినేని బ్రదర్స్ మధ్య కొనసాగుతున్న డైలాగ్ వార్
- ఎంపీ చిన్ని ఆరోపణలకు మాజీ ఎంపీ కేశినేని నాని కౌంటర్
- నాన్నా పిట్టల దొర, ప్రెస్‌మీట్ పెట్టి పిట్ట కథలు బాగా చెప్పావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kesineni Nani Slams Kesineni Chinni: విజయవాడ రాజకీయాల్లో కేశినేని సోదరుల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఎంపీ కేశినేని చిన్ని చేసిన ఆరోపణలకు మాజీ ఎంపీ కేశినేని నాని సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. బ్యాంకుల నుంచి రూ.120 కోట్ల రుణం తీసుకుని స్కాం చేశారని చిన్ని చేసిన వ్యాఖ్యలను నాని తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సందేశంలో కేశినేని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘నాన్నా పిట్టల దొరా.. ప్రెస్‌మీట్ పెట్టి పిట్టకథలు బాగా చెప్పావు. అది నీకు వెన్నతో పెట్టిన విద్య కదా’ అంటూ వ్యాఖ్యానించారు. తన అప్పులు, ఆస్తులు, ఆదాయం, బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బు, తాను ఉపయోగించే కార్లు, తన జీవనశైలి గురించి చిన్ని మాట్లాడారని పేర్కొన్నారు.
అయితే ప్రజలు తనను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకున్న విషయాన్ని ఎంపీ చిన్ని మరిచిపోయినట్లు ఉందని కేశినేని నాని ఎద్దేవా చేశారు. ‘నువ్వు ఢిల్లీలో పేకాడుకునే బదులు నా మీద ప్రధానమంత్రి, హోంమంత్రి లేదా ఆర్థిక మంత్రికి ఫిర్యాదు చేయవచ్చు. వారు దగ్గరకు రానీయకపోతే పార్లమెంట్లో నా గురించి మాట్లాడి నీ ఆవేదన వ్యక్తం చేయవచ్చు’ అని సూచించారు. అంతేకాకుండా తనపై అక్రమ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి నిజంగా ఆధారాలు ఉంటే సీబీఐ లేదా ఈడీకి ఫిర్యాదు చేసి విచారణ చేయించాలని సవాల్ విసిరారు. ‘నన్ను జైలుకు పంపించవచ్చు, నా ఆస్తులు జప్తు చేయించవచ్చు, వేలం వేయించి ప్రజలకు పంచిపెట్టవచ్చు’ అని నాని వ్యాఖ్యానించారు.
Also Read
- Fuel Exports: కేంద్రం సంచలన నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ జీరో
- Aus vs Ban Test: గెలుపు ముంగిట బంగ్లాదేశ్.. ఆసీస్‌కు ఓటమి తప్పదా?
- Vande Mataram Controversy: ‘వందేమాతరం’పై రాజకీయ దుమారం.. కాంగ్రెస్ కార్యాలయంలో ఏం జరిగింది?
- Guinness World Record: ముక్కు నేలకు తాకేలా హ్యాండ్‌స్టాండ్ పుష్అప్స్.. మహిళ గిన్నిస్ రికార్డు..
అలాంటి చర్యలు ఏవీ తీసుకోకుండా కేవలం ప్రెస్మీట్లు పెట్టి, తనకు అనుకూల మీడియా ద్వారా తప్పుడు కథనాలు ప్రచారం చేయడం వల్ల ప్రజలు నమ్మరని కేశినేని నాని అన్నారు. ఈ సందర్భంగా చిన్ని పేరును ప్రస్తావిస్తూ.. ‘మై డియర్ చార్లెస్ శోభరాజ్’ అంటూ సెటైర్ వేశారు. ఇటీవల కేశినేని చిన్ని చేసిన ఆరోపణలు, వాటికి నాని ఇచ్చిన సమాధానాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. విజయవాడ రాజకీయాల్లో కేశినేని సోదరుల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయంగా ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Fuel Exports: కేంద్రం సంచలన నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ జీరో
-
Aus vs Ban Test: గెలుపు ముంగిట బంగ్లాదేశ్.. ఆసీస్‌కు ఓటమి తప్పదా?
-
Comrade Kalyan Release Date:1992 బోర్డర్ కథతో శ్రీ విష్ణు డ్యూయల్ రోల్… ‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్ అవుట్
-
Mahindra BE 6 Formula E Freedom Edition: ‘Revive’ ఎమర్జెన్సీ ఫీచర్ తో.. మహీంద్రా BE 6 ఫార్ములా ఈ ఎడిషన్ రిలీజ్
-
Vande Mataram Controversy: ‘వందేమాతరం’పై రాజకీయ దుమారం.. కాంగ్రెస్ కార్యాలయంలో ఏం జరిగింది?
ట్రెండింగ్
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్‌లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!