FD Maturity Rules: మెచ్యూర్ అయిన FDని విత్‌డ్రా చేయకపోతే ఏమవుతుంది..? RBI కొత్త రూల్స్ తెలుసుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫిక్స్డ్ డిపాజిట్ గడువు ముగిసిన తర్వాత కూడా డబ్బులు తీసుకోకపోతే ఏం జరుగుతుందనే దానిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొన్ని స్పష్టమైన నిబంధనలు రూపొందించింది. సాధారణంగా ఎఫ్డీ కాలపరిమితి పూర్తి కాగానే ఖాతాదారుడికి డబ్బులు అందాలి. కానీ చాలాసార్లు సమాచారం లేకపోవడం వల్ల అలా జరగదు. ఎఫ్డీ ఖాతా తెరిచే సమయంలోనే ఆటో-రడ్యూవల్ ఆప్షన్ ఎంచుకుంటే, బ్యాంకు నిబంధనల ప్రకారం ఆ డిపాజిట్ మళ్లీ రెన్యూవల్ అవుతుంది. ఒకవేళ డబ్బులు నేరుగా ఖాతాలో జమ అయ్యేలా ఉంటే ఆ ప్రక్రియ జరుగుతుంది.
గడువు తీరిన తర్వాత కూడా ఎఫ్డీ డబ్బులు తీసుకోకపోతే, ఆ మొత్తంపై వడ్డీ విషయంలో కొన్ని మార్పులు ఉంటాయి. పాత ఎఫ్డీకి ఇస్తున్న వడ్డీయే ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పలేం. సాధారణ సేవింగ్స్ ఖాతా వడ్డీ లేదా గడువు ముగిసిన ఎఫ్డీపై వర్తించే వడ్డీ రేట్లలో ఏది తక్కువగా ఉంటే ఆ మొత్తమే లభిస్తుంది. ఒకవేళ ఎఫ్డీ మెచ్యూరిటీ తేదీ నుంచి పది సంవత్సరాల వరకు ఎలాంటి క్లెయిమ్ చేయకపోతే, ఆ డబ్బును అన్క్లెయిమ్డ్ డిపాజిట్‌గా పరిగణిస్తారు. పదేళ్లు పూర్తయిన తర్వాత ఆ మొత్తాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలోని డీఈఏ ఫండ్‌కు బ్యాంకులు బేలన్స్ చేసి బదిలీ చేస్తాయి.
Also Read
- Aliss Al Islam: బంగ్లాదేశ్ స్పిన్నర్ బౌలింగ్ యాక్షన్‌పై అనుమానం.. ఐసీసీకి రిపోర్ట్.!
- WTC Points Table: ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా గెలుపు.. అప్డేట్ అయిన పాయింట్ల పట్టిక.. టాప్ 5 దేశాలివే..
- Trump: ఇరాన్‌ను చిత్తుగా ఓడించాం.. ఎప్పటికీ అణ్వాయుధం ఉండదు
- Sanju Samson: అభిషేక్ శర్మతో మాట్లాడాను.. ఆ ఒక్క టెక్నిక్ ఫాలో అయ్యాను.. విధ్వంసకర ఇన్నింగ్స్‌గా మార్చాను..
అయితే, డిపాజిట్ చేసిన సొమ్ము ఎప్పటికైనా ఖాతాదారుడికే చెందుతుందని గమనించాలి. ఖాతాదారుడు లేదా చట్టపరమైన వారసులు ఎప్పుడైనా సంబంధిత బ్యాంకును సంప్రదించి, సరైన ధ్రువపత్రాలు సమర్పించి ఆ డబ్బును తిరిగి పొందవచ్చు. ఒకవేళ ఖాతాదారుడు మరణిస్తే, నామినీ లేదా చట్టపరమైన వారసులు డెత్ సర్టిఫికెట్, గుర్తింపు పత్రాలు సమర్పించి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎఫ్డీని తిరిగి రెన్యూవల్ చేసే ముందు ప్రస్తుత వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి, డబ్బు ఎప్పుడు అవసరమవుతుంది అనే విషయాలను బేరీజు వేసుకోవడం మంచిది. భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా కుటుంబ సభ్యులకు ఎఫ్డీ వివరాలు, నామినీ సమాచారం ఎప్పుడూ అందుబాటులో ఉంచడం చాలా ముఖ్యం.
తాజావార్తలు
-
FD Maturity Rules: మెచ్యూర్ అయిన FDని విత్‌డ్రా చేయకపోతే ఏమవుతుంది..? RBI కొత్త రూల్స్ తెలుసుకోండి..
-
Ultraviolette X-47 Venom: అల్ట్రావయోలెట్ X-47 Venom లాంచ్.. 343KM రేంజ్, 77 GHz రియర్ రాడార్, 155 km/h టాప్ స్పీడ్
-
Kusal Mendis: 430 పరుగుల లక్ష్యం చూసి భయపడలేదు.. ఇంగ్లండ్‌పై మా విజయానికి కారణం అదొక్కటే!
-
Aliss Al Islam: బంగ్లాదేశ్ స్పిన్నర్ బౌలింగ్ యాక్షన్‌పై అనుమానం.. ఐసీసీకి రిపోర్ట్.!
-
WTC Points Table: ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా గెలుపు.. అప్డేట్ అయిన పాయింట్ల పట్టిక.. టాప్ 5 దేశాలివే..
ట్రెండింగ్
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!